తారక్ లవర్ కి అప్పుడే అంత ఫాలోయింగా!

Thu Nov 21 2019 18:57:00 GMT+0530 (IST)

Olivia Morris For NTR In #RRR

RRR టీమ్ నుంచి కాస్టింగ్ కి సంబంధించిన కీలక ప్రకటన వెలువడం.. తారక్ సరసన నాయికను ఫిక్స్ చేయడంతో అది కాస్తా నందమూరి అభిమానుల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఎవరు ఈ కొత్త స్టార్లు? అంటూ గూగుల్ లో సెర్చ్ మొదలైంది. ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో అలీసన్ డూడీ.. రే స్టీవెన్ సన్ విలన్లుగా నటిస్తారని ప్రకటించిన దానయ్య- రాజమౌళి టీమ్ తారక్ లేడీ లవ్ ఒలీవియా మోరిస్ ని ఘనంగానే పరిచయం చేశారు.ఒలీవియా ఈ చిత్రంలో బ్రిటీష్ రాకుమారి జెన్నిఫర్ పాత్రలో  నటించనుంది. తన తల్లిదండ్రులైన లేడీ స్కాట్- స్కాట్ లతో కలిసి ఇండియాలో అడుగు పెట్టాక తనతో మన్యంవీరుడైన కొమురం భీమ్ కనెక్షన్ ఏమిటి? అన్నది తెరపై ఆద్యంతం రొమాంటిక్ గా చూపించబోతున్నారట. ఆర్.ఆర్.ఆర్ లో తారక్ సరసన ఒలీవియా ఫైనల్ అయ్యింది అనగానే ఈ బ్యూటీ ఎలా ఉంటుంది? అంటూ గూగుల్ లో సెర్చ్ మొదలైంది. దీంతో ఒలీవియా పేరు ఓవర్ నైట్ పాపులరైపోయింది. ఇప్పటివరకూ ఈ అమ్మడు ఎవరో అటు ఇండియా లెవల్లో కానీ ఇటు తెలుగు ఆడియెన్ కి కానీ పెద్దంతగా తెలిసిందేమీ లేదు. ఒకే ఒక్క ఆఫర్ అమ్మడి లైఫ్ నే మార్చేస్తోంది.

వాస్తవానికి తారక్ సరసన డైసీ ఎడ్గార్ జోన్స్ ఎంపికైనా రకరకాల వ్యక్తిగత కారణాలతో తప్పుకుంది. ఆ తర్వాత ఇంతకాలానికి తారక్ నాయికను ఫైనల్ చేయగలిగారు. ఒలీవియా పేరు ప్రస్తుతం తారక్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. తన ఫోటోల్ని అభిమాన సంఘాలు అంతే వైరల్ గా ప్రచారం చేస్తున్నాయి. అలా తనకోసం ఇప్పటికే 2 లక్షలు పైగా అభిమానులు గూగుల్ సెర్చ్ చేశారట. తాజాగా మోరిస్ స్పైసీ ఫోటోలు వెబ్ మాధ్యమాల్లో జోరుగా వైరల్ అయిపోతున్నాయి. అందులో ఓ బికినీ ఫోటో ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.