Begin typing your search above and press return to search.

#RRR: తార‌క్ స‌ర‌స‌న ఆమె కాదు ఈమె

By:  Tupaki Desk   |   20 Nov 2019 11:43 AM GMT
#RRR:  తార‌క్ స‌ర‌స‌న ఆమె కాదు ఈమె
X
కుడి ఎడ‌మ అయితే పొర‌పాటు లేదోయ్! అన్న చందంగా ఆర్.ఆర్.ఆర్ లో తార‌క్ స‌ర‌స‌న న‌టించే బ్యూటీ ఫ‌లానా హాలీవుడ్ న‌టి అంటూ ప్ర‌చార‌మైంది. కానీ ఇంత‌లోనే మ‌రో అమ్మ‌డి పేరును చిత్ర‌బృందం ప్ర‌క‌టించి షాక్ ఇచ్చింది. అయితే కొమురం భీమ్ ల‌వ్ జెన్నిఫ‌ర్ పాత్ర‌లో న‌టించే ఆ అమ్మ‌డి పేరు మాత్రం నిక్క‌చ్ఛిగా తెలిసిపోయింది.

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ఆర్.ఆర్.ఆర్ గురించి వేడెక్కించే రెండు అప్ డేట్లు అందించ‌బోతున్నారు అంటూ ఉద‌యం నుంచి అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే విదేశీ ముద్దుగుమ్మ పేరు రివీల్ చేయ‌నున్నార‌న్న ప్ర‌చారంతో తార‌క్ ఫ్యాన్స్ లో ఆస‌క్తి నెల‌కొంది. అలాగే ఇందులో న‌టించే లేడీ విల‌న్ ని కూడా రివీల్ చేసేసారు.

తార‌క్ హీరోయిన్ ఎవ‌రో చెబుతాం అంటూ ట్విట్ట‌ర్ లో ఊరించిన ఆర్.ఆర్.ఆర్ బృందం ఎట్ట‌కేల‌కు ఒలివియా మోరిస్ అనే అందాల హాలీవుడ్ న‌టి ఈ చిత్రంలో న‌టించ‌నుంద‌ని వెల్ల‌డించింది. సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ ట్విట్ట‌ర్ లో ఈ పేరును రివీల్ చేశారు. ``ఒలివియా మోరిస్ కు స్వాగతం. మా సినిమాలో మీరు ప్రధాన పాత్ర అయిన జెన్నిఫర్ పాత్రను పోషిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. షూట్ కోసం ఎదురు చూస్తున్నాం`` అంటూ వెల్ల‌డించారు.

అయితే తారక్ హీరోయిన్ గా వేరొక అమ్మ‌డి పేరు ఇంత‌కుముందు వినిపించింది. కొమురం భీమ్ పాత్ర‌ధారి ఎన్టీఆర్ స‌ర‌స‌న జోసెఫీన్ లాంగ్ ఫోర్డ్ అనే విదేశీ ముద్దుగుమ్మ‌ని ఫైన‌ల్ చేశారు అంటూ ఇంత‌కుముందు ప్ర‌చార‌మైంది. అయితే లాంగ్ ఫోర్డ్ ని ఈ అవ‌కాశం వ‌రించ‌లేద‌ని తాజాగా వెల్ల‌డించిన ఈ కొత్త పేరు చెబుతోంది.