Begin typing your search above and press return to search.

రొమాంటిక్ సినిమాకు రెడీ అయిన పాత ఫ్రెండ్సు!

By:  Tupaki Desk   |   2 Jun 2020 7:32 AM GMT
రొమాంటిక్ సినిమాకు రెడీ అయిన పాత ఫ్రెండ్సు!
X
ఆమె ఓ స్టార్ హీరోయిన్. ఈమధ్య ఎక్కువగా లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. అయితే కొంత గ్యాప్ తర్వాత ఒక యాక్షన్ హీరోతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఈ యాక్షన్ హీరోతో ఈ హీరోయిన్ గతంలో రెండు సార్లు జోడీ కట్టింది. ఆ రెండు సినిమాలు కూడా హిట్లే. అయితే గత పన్నెండేళ్లుగా ఆ హీరోతో మరో సినిమా చేయలేదు.

కారణం ఏంటంటే ఈ బ్యూటీకి ఆ యాక్షన్ హీరోకి మధ్య ఏదో జరుగుతోందని.. అప్పట్లో గుసగుసలు వినిపించాయి. నటించిన రెండు సినిమాలు హిట్ కావడం.. ఇద్దరి కెమిస్ట్రీలో బీకాం ఫిజిక్స్ కనిపించడంతో జనాలు కూడా చాలామంది ఇద్దరి మధ్య ఏదో ఉందని నమ్మారు. ఆయనతో నటించడం కొనసాగితే ఈ రూమర్లు ఆగవనే ఉద్దేశంతో ఆయనతో సినిమాలలో నటించడం ఆపేసింది హీరోయిన్. తర్వాత కొంతకాలానికి ఆ హీరోకు మ్యారేజ్ కూడా అయిపోయింది. ఈ హీరోయిన్ కు మాత్రం ఇంకా పెళ్లి కాలేదు.

ఈ ఇద్దరూ ఇప్పుడు చెయ్యబోయే సినిమా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అంటున్నారు. మరి ఇద్దరి మధ్య ఫ్లాష్ బ్యాక్ ఏమైనా వస్తుందా.. అవే రూమర్లు మరోసారి తలెత్తుతాయా అనేది వేచి చూడాలి. అయితే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.