ఈ సీనియర్ హీరోయిన్ గ్లామర్ చూస్తే మతిపోద్దీ

Sat Jun 06 2020 12:40:49 GMT+0530 (IST)

Old Actress Khushbu Stunning Show

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫొటోలు చూస్తే నిజంగానే షాక్ అవ్వకమానరు.. ఎవరా హీరోయిన్.. ఎంత స్మార్టుగా ఉందని ఆరాతీస్తారు. ఆమె ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.  ఆ బ్యూటీ మరెవరో కాదు.. అలనాటి ప్రముఖ కథానాయిక కుష్బూ. అవును పై ఫొటోలో ఉన్న గ్లామరస్ లేడి నాటి హీరోయిన్ కుష్బూనే.కుష్బూ పూర్తి స్లిమ్ముగా అయిపోయింది. లావుగా కనిపించే కుష్బూ ఫొటోలను చూసి ఈమె ఆమేనా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. సన్నగా.. నాజుగ్గా గుర్తుపట్టలేనంతగా బక్కపలుచుగా కుష్బూ ఇప్పుడు మారిపోయింది.

కుష్బూ  నిజానికి తెలుగు తమిళ భాషల్లో కథనాయికగా నటించినప్పుడు సన్నగా ఉండేవారు. కానీ తర్వాత పెళ్లి చేసుకొని లావయ్యారు. అనంతరం రాజకీయాల్లో వెళ్లి అక్కడ రాణిస్తున్నారు. సినిమాలు టీవీ సీరియల్స్ లో తల్లి పాత్రలు పోషిస్తున్నారు. రజినీ కాంత్ అత్తగా చిరంజీవి అక్కగా నటించారు.

అయితే లాక్ డౌన్ వేళ కుష్బూ తన లావుతనంపై పెద్ద యుద్ధమే చేశారు. అందుకే ఏకంగా వ్యాయామంతో 15 కిలోల బరువు తగ్గి చాలా స్లిమ్ గా తయారయ్యారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విడుదల చేశారు. కుష్బూను అంత సన్నగా.. గ్లామర్ గా చూసి అందరూ షాక్ అవుతున్నారు. మూడు నెలల్లోనే 15 కిలోలు బరువు తగ్గిన కుష్బూ తాజాగా రజినీకాంత్ నటిస్తున్న ‘అన్నాత్త’ చిత్రం కోసమే ఇలా బరువు తగ్గారని సమాచారం. మరి కుష్బూ కొత్త లుక్ తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరీ..