Begin typing your search above and press return to search.

ఓటీటీ వర్సెస్ థియేటర్స్.. రెండేళ్లలో కొత్తగా 10 వేల స్క్రీన్లు..!

By:  Tupaki Desk   |   6 Dec 2022 8:05 AM GMT
ఓటీటీ వర్సెస్ థియేటర్స్.. రెండేళ్లలో కొత్తగా 10 వేల స్క్రీన్లు..!
X
కరోనాకు ముందు సినిమా హాళ్ళు మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్న చందంగా నడిచాయి. అయితే గత రెండేళ్లలో కరోనా ధాటికి ఈ రంగం పూర్తిగా కుదేలైపోయింది. జనాలు ఒకచోట గుమికూడే పరిస్థితి లేకపోవడం.. లాక్ డౌన్.. పాక్షిక లాక్ డౌన్ల కారణంగా థియేటర్ రంగం పూర్తిగా దెబ్బతింది. కరోనా కాలంలో సినీ ప్రియులంతా ఓటీటీలకు అలవాటు పడటంతో థియేటర్ల బీజీగా భారీగా పడిపోయింది.

ప్రస్తుతం కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో సినిమా హాళ్లన్నీ మళ్లీ జనాలతో కళకళ లాడుతున్నాయి. అయితే సినిమా టికెట్ల రేట్లు.. ఫుడ్ ఐటమ్స్ ధరలు ప్రేక్షుకుడిపై భారాన్ని మోపుతున్నాయి. దీంతో అభిమానులు సైతం కేవలం కంటెంట్ ఉన్న సినిమాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో పెద్ద హీరోల సినిమాలైనా సరే ఒకటి రెండు వారాల్లోనే పెట్టే పెడా సర్దేస్తున్నాయి.

ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు అలవాటు పడిన జనాలు థియేటర్లలోనూ అలాంటి కంటెంట్ నే కోరుకుంటున్నారు. దీంతో చిన్న సినిమా అయినా సరే కంటెంట్ ఉంటే అదే బాక్సాఫీస్ బాద్షాగా నిలుస్తుంది. లేకుంటే మాత్రం ప్రేక్షకులు నిర్ధాక్షిణ్యంగా సినిమాలను తిరస్కరిస్తున్నారు. దీంతో దర్శక, నిర్మాతలు ఆ దిశ కంటెంట్ లో మార్పులు చేస్తూ సగటు అభిమానిని సినిమా థియేటర్ కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇలాంటి సమయంలోనే ప్రభుత్వ రంగ సీఎన్సీ గ్రామీణ ప్రాంతాల్లోనూ చిన్న థియేటర్లను నెలకొల్పేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. రాబోయే రెండేళ్లలో 10వేల కొత్త థియేటర్లను గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పడమే లక్ష్యంగా పని చేస్తుంది. ఇందుకోసం గత నెలలో ‘సినిమాస్’తో సీఎన్సీ ఎలక్ట్రానిక్స్.. ఐటీ మంత్రిత్వ శాఖ చేతులు కలిపింది.

గ్రామీణ ప్రాంతాల్లో 100 నుంచి 200 సీటింగ్ కెపాసిటీ ఉన్న లక్ష థియేటర్లను తెరవాలని ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సీఎన్సీ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ రాకేష్ తెలిపారు. 2024 చివరి నాటికి ఏకంగా 10వేల సినిమా థియేటర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

ఈ సినిమా హాళ్లు నడపాలంటే పెట్టుబడి సుమారు 15 లక్షల వరకు అవసరం అవుతుందన్నారు. గ్రామీణ ప్రాంతంలోని వ్యాపారులకు ఈ సినిమా హాళ్లు కొత్త అవకాశాలను కల్పిస్తాయనే భరోసాను ఆయన వ్యక్తం చేశారు. ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఎంతోమంది ఉపాధి లభిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

కాగా అతి తక్కువ ధరలోనే ఓటీటీ ఫ్లాట్ఫామ్ లలో కొత్త సినిమాలన్నీ లభ్యమవుతున్న తరుణంలో ఇప్పుడున్న థియేటర్ల మనగడే ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి తరుణంలో కేంద్రం గ్రామీణ ప్రాంతంలోనూ థియేటర్లను బలోపేతం చేయాలని చూస్తుండటం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరీ ఈ నిర్ణయం ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందనేది మాత్రం వేచి చూడాల్సిందే..!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.