Begin typing your search above and press return to search.

థియేటర్లు తెరిచినా తగ్గని ఓటీటీల హవా

By:  Tupaki Desk   |   30 July 2021 3:34 PM GMT
థియేటర్లు తెరిచినా తగ్గని ఓటీటీల హవా
X
చాలా రోజుల నిరీక్షణ తర్వాత ఈ రోజు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో సినిమా థియేటర్లు రీ ఓపెన్ అయ్యాయి. ఎన్నో రోజుల నుంచి సిల్వర్ స్ర్కీన్ మీద సినిమాల విడుదల లేక చాలా సినిమాల విడుదల వాయిదా పడింది. కానీ కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీ రిలీజ్ బాట పట్టాయి. చిన్న హీరోల చిత్రాలనే కాకుండా స్టార్ హీరోల సినిమాలు కూడా ఓటీటీ వేదికల్లో డైరెక్టుగా రిలీజ్ అయి ఆశ్చర్యపరిచాయి. ఇలా పెద్ద హీరోల సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ కావడం పట్ల కొంత మంది నిర్మాతలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా కూడా ఎటువంటి లాభం లేకపోయింది.

ప్రస్తుత పరిస్థితులు కూడా ఓటీటీ రిలీజ్ కే మేకర్స్ మొగ్గు చూపేలా చేయడంతో వారు చేసేదేం లేక ఓటీటీ రిలీజ్ చేశారు. జనాలు కూడా ఓటీటీలకే మొగ్గు చూపడంతో మేకర్స్ కూడా చాలా ఖుషీ అయ్యారు. ఓటీటీల్లో సినిమాలు విడుదల చేస్తూ... తాపీగా ఉన్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కాస్త నెమ్మదించడంతో ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తేసింది. దీంతో నేటి నుంచి అనేక రాష్ర్టాలో సినిమా హాళ్లు ఓపెన్ అయ్యాయి.

ప్రస్తుతం అందరిలో నెలకొన్న ప్రశ్న ఒక్కటే. అసలు ఇన్ని రోజులు ఓటీటీ సినిమాలకు అలవాటు పడిన జనం ఈ సమయంలో థియేటర్లు తెరిచినా.... ప్రజలు వస్తారా? రారా అనే సందేహాలు రేకెత్తిస్తున్నారు. అంతే కాకుండా థియేటర్లు ఓపెన్ అయ్యాక కూడా పలువురు స్టార్ల సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవడం పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ రోజు తాజాగా ఆహా ఓటీటీలో ఒక మూవీ రిలీజ్ అయింది. అలాగే సోనీ లివ్ లో కూడా ఒక సినిమా విడుదలయింది. వన్ మూవీ మలయాళ చిత్రం అయినప్పటికీ ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. కాగా ఇది తెలుగు డిజిటల్ ప్లాట్ ఫాం ఆహాలో డబ్ అయి రిలీజయింది. ఈ మూవీలో రాజకీయాలు ప్రధానంగా ఉండనున్నాయి. ఈ మూవీ మలయాళ వర్షన్ సూపర్ హిట్ గా నిలిచింది. దీని తెలుగు డబ్బింగ్ పై కూడా చాలా అంచనాలున్నాయి.

ఈ మూవీకి సంతోష్ విశ్వనాథ్ దర్శకత్వం వహించడం గమనార్హం. ఇక అంతే కాకుండా ముద్దుగుమ్మ, కౌసల్యా కృష్ణమూర్తి లాంటి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన అమ్మడు ఐశ్వర్య రాజేష్ నటించిన తిట్టం మూవీ ఈ రోజు సోనీ లివ్‌లో విడుదలయింది. ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్‌గా మంచి విజయం సాదించింది. ఇందులో ముద్దుగుమ్మ ఐశ్వర్యా రాజేష్ స్నేహితుడి కోసం వెతుకుతున్న పోలీసుగా మెవవనుంది.