Begin typing your search above and press return to search.

ఆ బడా సంస్థకు ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులు!

By:  Tupaki Desk   |   2 Dec 2022 12:01 PM GMT
ఆ బడా సంస్థకు ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులు!
X
నాని ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ బ్యానర్లో నిర్మించిన హిట్ సెకండ్ కేసు సినిమా శుక్రవారం రోజు భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్ మెల్లగా పెరుగుతోంది. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ వీకెండ్ సినిమాకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. శని ఆదివారాల్లో మొదటి రోజు కంటే ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ రావచ్చని కూడా ఒక టాక్ అయితే వినిపిస్తోంది.

ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి కూడా మంచి రివ్యూలు వచ్చాయి. మొత్తానికి దర్శకుడు శైలేష్ రెండవ హిట్ తో కూడా సక్సెస్ అందుకున్నాడు అనే విధంగా సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వస్తున్నాయి.. అంతే కాకుండా ఓవర్గం ప్రేక్షకుల నుంచి ఈ సినిమా అంచనాలను అందుకోలేదు అనే టక్ ను కూడా అందుకుంది కానీ అదేమీ అంతగా ప్రభావం చూపకపోవచ్చు. ఇక అడివి శేష్ నటించిన హిట్ 2వ కేసు అతని కెరీర్ లోనే బిగ్గెష్ ఓపెనింగ్స్ అందుకునే అవకాశం కూడా ఉంది.

శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఈ చిత్రం తన OTT భాగస్వామిని లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రీక్వెల్ స్ట్రీమింగ్ హక్కులను కలిగి ఉన్న అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా హక్కులను కూడా కైవసం చేసుకుంది.

మొదట హాట్ స్టార్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసుకోవడానికి భారీ స్థాయిలో ఆఫర్ చేసినప్పటికీ కూడా అమెజాన్ ప్రైమ్ ముందుగానే నానితో ఒప్పందం చేసుకుని ఎవరు ఊహించని విధంగా ఒక ఆఫర్ అయితే ఇచ్చినట్లు తెలుస్తోంది.

మొత్తానికి నిర్మాతలకు నాన్ థియేట్రికల్గానే హిట్ 2 మంచి ప్రాఫిట్స్ అందించినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఐతే 15 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రస్తుతం టాక్ ని బట్టి శుక్రవారం రోజు మంచి ఓపెనింగ్ అందుకునే అవకాశం ఉంది.

వీకెండ్ లో పెద్దగా పోటీగా సినిమాలు కూడా లేవు కాబట్టి నెంబర్స్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ వారంలోనే సినిమా పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకురావచ్చు. ఇక త్వరలోనే దర్శకుడు శైలేష్ నిర్మాత నాని హిట్ 2 ని కూడా సెట్స్ పైకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.