Begin typing your search above and press return to search.

'కాంతార‌' అక్క‌డ రీసౌండ్ ఇవ్వ‌డం లేదా?

By:  Tupaki Desk   |   28 Nov 2022 5:30 PM GMT
కాంతార‌ అక్క‌డ రీసౌండ్ ఇవ్వ‌డం లేదా?
X
వెండితెర‌పై ఈ మ‌ధ్య కాలంలో హ‌ల్ చేసిన సినిమాలు ఓటీటీ వేదిక‌పై ఆ స్థాయిలో సంల‌చ‌నాలు సృష్టించ‌లేక‌పోతున్నాయి. ఓటీటీ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డం లేదు. కార‌ణం ఈ మ‌ధ్య ప్రేక్ష‌కుల్లోనూ రెండు వ‌ర్గాలు త‌యారయ్యాయి. థియేట‌ర్ ల‌లో సినిమాలు చూసే వారు.. ఓటీటీల్లో మాత్ర‌మే సినిమాలు, సిరీస్ లు చూసేవారు. థియేట‌ర్ల‌లో సినిమాలు చూసే వ‌ర్గానికి న‌చ్చిన సినిమాలు ఓటీటీ ప్రియులకు న‌చ్చ‌డం లేదు. ఓటీటీ ప్రియుల‌కు న‌చ్చిన సిరీస్ లు థియేట‌ర్ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌డం లేదు.

ఇదే ఇప్ప‌డు `కాంతార‌`కు ఓటీటీలో ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారిందా? అంటే అవున‌నే స‌మాధానం చెబుతున్నారు. రిష‌బ్ శెట్టి హీరోగా న‌టించి ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కించిన సినిమా `కాంతార‌`. కేజీఎఫ్‌` మేక‌ర్స్ హోంబ‌లే ఫిలింస్ పై నిర్మించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌నే కాకుండా ఉత్త‌రాది వారిని కూడా ఆక‌ట్టుకుంది. దీంతో ఐదు భాష‌ల‌కు చెందిన ప్రేక్ష‌కులు ఈ మూవీకి బాక్సాఫీస్ వ‌ద్ద కాసులు వ‌ర్షం కురిపించారు.

సినిమా విడుద‌లైన ప్ర‌తీ భాష‌లోనూ బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా ఐదు భాష‌ల్లో రూ. 400 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి విజ‌య‌వంతంగా దూసుకుపోతోంది. ఈ మూవీని రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. అక్క‌డ కూడా ఇదే స్థాయి ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని మేక‌ర్స్ భావించారు. కానీ అక్క‌డ `కాంతార‌` రీసౌండ్ ఇవ్వ‌డం లేద‌ని తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఊహించ‌ని రీతిలో రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన ఈ మూవీ ఓటీటీలో మాత్రం ఆ స్థాయిలో ఆద‌ర‌ణ‌న‌ని పొందక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

కార‌ణం ఓటీటీ ప్రియుల‌కు `కాంతార‌` పెద్ద‌గా న‌చ్చ‌డం లేద‌ట‌. వ‌న్ టైమ్ మాత్రమే చూడ‌ద‌గ్గ సినిమా ఇదిని, సినిమా ప్రారంభం.. క్లైమాక్స్ త‌ప్ప ఏముంది ఇందులో అని ఓ వ‌ర్గం ప్రేక్ష‌కులు పెద‌వి విరుస్తున్నార‌ట‌. ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనిపించుకున్న సినిమాలు ఓటీటీల్లో ఇదే త‌ర‌హా ఫ‌లితాన్ని పొంది ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. థియేట‌ర్ల‌లో విడుద‌లై `సీతారామం` ఎపిక్ ల‌వ్ స్టోరీగా ప్ర‌శంస‌ల‌తో పాటు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందింది.

అయితే ఈ మూవీకి ఓటీటీలో థియేట‌ర్ రెస్పాన్స్ ల‌భించ‌ని విష‌యం తెలిసిందే. ఆ మ‌ధ్య విడుద‌లైన `RRR` కి త‌ప్ప ఓటీటీలో మ‌రే సినిమాకు భారీ స్పంద‌న ల‌భించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ ట్రెండ్ ప్ర‌మాదం కాక పోయినా సినిమాల డిమాండ్ ని కాస్త త‌గ్గించే అవ‌కాశం వుంద‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.