#తెలుగమ్మాయిల గడుసుతనం.. ఫోటోషూట్లకు ఓకే కానీ సినిమాలకు నాట్ ఓకే

Thu Jun 10 2021 09:00:01 GMT+0530 (IST)

OK for photoshoots but not ok for movies

తెలుగమ్మాయిల్లో నేటితరం కథానాయికలు హాట్ ఫొటోషూట్లతో నెట్ లో హల్ చల్ చేస్తున్నా కానీ సరైన అవకాశాలు రావడం లేదు ఎందుకని..! కొందరు ఇండస్ట్రీ పెద్దల్ని ఇదే విషయమై ప్రశ్నిస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి..!ఫొటో షూట్స్ కి పరువొంపుల సంపదల్ని చూపించడానికి సిద్ధపడినా కానీ ఈ తెలుగు బ్యూటీలు సినిమాల విషయానికి వస్తే హద్దులు నిర్ణయిస్తున్నారని కండీషన్స్ అప్లయ్ అంటున్నారని తెలిసింది. ఫోటోషూట్ల వరకూ ఓకే కానీ సినిమాలకు నాట్ ఓకే అనేస్తున్నారట. కేవలం ఫొటో షూట్స్ కి మాత్రమే అందంగా కనిపించే ఈ భామలు సినిమాల్లో అంత సేపు చూడటానికి అంతందంగా కనిపించడం లేదనేది గుసగుస.

దీంతో ఆడియన్ సంతృప్తి కోసం ఆన్ స్క్రీన్ ఫ్రెష్ ఫీల్ కలిగించడానికి ఇతర భాషల సుందరీమణుల పై ఆధారపడుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. నిజానికి తెలుగులో తెలుగమ్మాయిలకు అవకాశాలివ్వడం లేదు అంటే గ్లామర్ షోకి స్వేచ్ఛగా అంగీకరించరు కాబట్టే అంటూ రూమర్ ఉంది. ఇటీవల లేటెస్ట్ భామల్లో కొంతవరకూ కొన్ని విషయాల్లో పట్టు విడుపు ఉన్నా ఎంతైనా తెలుగు సాంప్రదాయంలో హద్దుమీరడం అన్నది ఉండదు. అందుకే ముంబై- బెంగళూరు-కోల్ కత-దిల్లీ- గోవా- మంగుళూరు అందాల కోసం మన దర్శకనిర్మాతలు హీరోలు వెంపర్లాడతుంటారన్నమాట.