పెళ్లిలో గన్ పేల్చిన దేవగన్ వారసురాలు

Wed May 25 2022 10:59:38 GMT+0530 (IST)

Nysa Devgn Stuns at Wedding

ముంబై సెలబ్ కల్చర్ లో వింతలు విశేషాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వేడుక ఏదైనా సెలబ్రిటీల అద్భుత వేషధారణలు ఫోటోగ్రాఫర్ల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటాయి. ఇక నటవారసురాళ్ల హంగామా అయితే అంతా ఇంతా కాదు. తాజాగా పాపులర్ గాయని కనికా కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్ నుండి అజయ్ దేవగన్ కుమార్తె నైసా దేవగన్ ఫోటోలు వెబ్ ని వేడెక్కించేస్తున్నాయ్.అజయ్ దేవగన్- కాజోల్ జంట కుమార్తె నైసా దేవగన్ తన స్నేహితులు వేదాంత్ మహాజన్ - ఓర్హాన్ అవత్రమణితో కలిసి కనికా కపూర్ వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు. గాయని కనికా కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్ కు  కుటుంబ సభ్యులు పరిమితంగా బంధుమిత్రు మాత్రమే హాజరయ్యారు. అజయ్ దేవగన్ కూతురు నైసా దేవగన్ తన స్నేహితులు వేదాంత్ మహాజన్ .. ఓర్హాన్ అవత్రమణితో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. లండన్ లోని విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో జరిగిన వేడుకలో నైసా మెరుపులు మెరిపించింది. ముఖ్యంగా పింక్ బాడీ హగ్గింగ్ ఫ్రాకులో గుబులు రేపింది. నైసా కాంబినేషన్ గా హాట్ పింక్ బ్లాక్ హీల్స్ ని ధరించింది.

నైసా స్నేహితుడు ఓర్హాన్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో రిసెప్షన్ నుండి చాలా ఫోటోలను పంచుకున్నాడు. ఒక ఫోటోలో ఓర్హాన్ - గురు రంధవా ఉన్నారు. మరొక ఫోటోలో నైసా- వేదాంత్- కనికా ఉన్నారు. మీతో నా సమయాన్ని వృథా చేయడానికి నేను నా సమయాన్ని కేటాయించి ఒకటికి రెండుసార్లు చుట్టూ తిరుగుతాను'' అనే శీర్షికతో ఓర్హాన్ ఈ ఫోటోలు పంచుకున్నారు. ఈ ఫోటోలపై అతని స్నేహితులు కామెంట్ లతో విరుచుకుపడ్డారు.

సమయాన్ని వృథా చేయడం ఎప్పుడూ అంత బాగా అనిపించదు! అని జాన్వీ కపూర్ రిప్లయ్ ఇచ్చారు. అయితే బనితా సంధు ఓర్హాన్ కు ''వీక్షణ అనుభవం కోసం'' అంటూ కృతజ్ఞతలు తెలిపారు. నైసా దేవగన్ పైనా అభిమానులు అరుదైన కామెంట్స్ చేసారు. ''నైసా ఈజ్ లవ్ మ్యాన్''అంటూ అభిమాని వ్యాఖ్యానించారు. మరొక అభిమాని నైసా ఫ్యాషన్ సెన్స్ ను ప్రశంసించాడు.

నవవధువు కనికా కపూర్ పెళ్లి తర్వాత ప్రస్తుతం ఆనంద డోలికల్లో తేలుతోంది. మే 20న వ్యాపారవేత్త గౌతమ్ హథీరామన్ ను పెళ్లాడిన సింగర్ కనిక తన పెళ్లి ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. "నేను అవును అని చెప్పాను. అద్భుత కథలు మీకు పుట్టొచ్చు.. వాటిని నమ్మడం మానేయండి. కలలు కనండి.. ఎందుకంటే ఒక రోజు ఆ కలలు నిజమవుతాయి. నేను నా యువరాజును కనుగొన్నాను.. నేను నా సహచరుడిని కనుగొన్నాను.

మమ్మల్ని కలుసుకునేలా చేసినందుకు విశ్వానికి చాలా కృతజ్ఞతలు'' అని క్యాప్షన్ గా రాసింది. కలిసి మా ప్రయాణాన్ని ప్రారంభించడానికి సంతోషిస్తున్నాం. మీతో ముసలితనం పెరగడానికి.. ప్రేమించడానికి  మీతో నేర్చుకోవడానికి ఈ పయనం. కానీ మీతో నవ్వడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ నన్ను నవ్వించినందుకు ధన్యవాదాలు. నా బెస్ట్ ఫ్రెండ్.. నా భాగస్వామి.. నా హీరో" అంటూ ఎమోషనల్ గా వ్యాఖ్యానించింది.