సమంత కు టాలీవుడ్ సపోర్ట్ లేదా..?

Sat Oct 23 2021 16:36:33 GMT+0530 (IST)

Not Tollywood support for Samantha

దక్షిణాది అగ్ర కథనాయికల్లో ఒకరైన సమంత ఇటీవలే తన వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్య ను ప్రేమ వివాహం చేసుకున్న సామ్.. తమ నాలుగేళ్ళ వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించింది. స్టార్ కపుల్ విడిపోవడానికి కారణాలు వెల్లడించనప్పటికీ.. దీనిపై ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. చై-సామ్ విడాకుల వ్యవహారంలో తప్పు ఎవరిదనే కోణంలో సోషల్ మీడియాలో అనేక మంది విశ్లేషణలు చేస్తూ వస్తున్నారు.సమంత విడాకుల ప్రకటన చేసిన తర్వాత ఆమె పై సానుభూతి వస్తుందని కొందరు ఆలోచన చేశారు. అక్కినేని వంటి పెద్ద ఫ్యామిలీ నుంచి బయటకు వస్తున్నప్పటికీ.. అమ్మాయి కాబట్టి సాధారణంగా సామ్ సైడ్ ఎక్కువ సానుభూతి చూపిస్తారని భావించారు. కానీ ఎందుకో సోషల్ మీడియాలో మరియు టాలీవుడ్ లో ఆమె మీద పాజిటివ్ కామెంట్స్ కంటే నెగెటివ్ వార్తలు వచ్చాయి.

ఈ వ్యవహారంలో సమంత సైడ్ మిస్టేక్ ఉన్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆమెను ట్రోల్స్ చేశారు. సామ్ కు పిల్లలను కనడం ఇష్టం లేదని.. అందుకే విడిపోయారని విమర్శలు చేశారు. అలానే సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ తో ఎఫైర్ పెట్టుకున్నందని.. అందుకే విడాకుల వరకు వచ్చిందని అనేక కథలు అల్లారు. ఈ రూమర్స్ ని ఆమె ఖండించింది. తన గోప్యతకు భంగం కలిగించొద్దని.. తనని ఒంటరిగా వదిలేయాలని కోరింది.

ఏదేమైనా స్టార్ హీరోయిన్ సమంత పర్సనల్ లైఫ్ లో దురదృష్టకరమైన సంఘటన జరిగిన తరువాత ఆమెను వీక్ చేశారని పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది. అయితే సామ్ మాత్రం ఈ కష్టకాలం నుంచి వీలైనంత త్వరగా బయటకు రావాలని నిర్ణయించుకుంది. కెరీర్ మీద ఫోకస్ పెట్టి వరుసగా సినిమాలు కమిట్ అవుతోంది. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో చేస్తున్న 'శాకుంతలం' మూవీ షూటింగ్ తో పాటుగా డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసింది. అలానే తమిళ్ లో విజయ్ సేతుపతి - నయనతార లతో కలిసి సమంత ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక దసరా సందర్భంగా సమంత రెండు ద్విభాషా చిత్రాలను అనౌన్స్ చేసింది. ఇవి సెట్స్ మీదకు వెళ్లే గ్యాప్ లో సమంత తీర్థయాత్రలకు వెళ్ళింది. విడాకుల ప్రకటనకు కొద్ది రోజుల ముందు తిరుపతి - శ్రీకాశహస్తి దైవ దర్శనాలకు వెళ్లిన సమంత.. ఇప్పుడు ఉత్తర భారతదేశంలోని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తోంది. యమునోత్రి నుంచి మొదలైన సామ్ చార్ధామ్ యాత్ర.. గంగోత్రి మీదుగా కేదార్నాథ్ - బద్రీనాథ్ వరకు సాగింది. దీనికి సంబంధించిన విశేషాలను ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంది. చార్ ధామ్ యాత్ర అద్భుతంగా సాగిందని సామ్ పేర్కొంది.

సమంత స్నేహితురాలు ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డితో కలిసి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిందని తెలుస్తోంది. అనంతరం గంగా ఆరతిలో పాలుపంచుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ మూడు యూట్యూబ్ ఛానల్స్ పై సమంత కూకట్ పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత జీవితంపై లేనిపోని అబద్ధాలు చెబతూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ సామ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. యూట్యూబ్ ఛానల్స్ పై సమంత వేసిన పరువు నష్టం దావా కేసును కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. మరోసారి వాదనలు విన్న తర్వాత తీర్పు వెలువరిస్తామని కూకట్ పల్లి కోర్టు వ్యాఖ్యానించింది.