మొన్న 'బికినీ'కి సిద్ధమని.. నేడు ముద్దు కూడా వద్దంటుంది!

Mon May 25 2020 13:40:36 GMT+0530 (IST)

Not Ready To Do Kiss Scenes

ప్రస్తుతం ప్రపంచంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. షూటింగ్ ప్రారంభమైన సినిమాలు.. షూటింగులో ఉన్న సినిమాలు.. విడుదలకు సిద్దమైన సినిమాలు.. ఇలా ఎన్నో సినిమాలు కేవలం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి.  షూటింగ్స్ నిలిచిపోవడంతో సెలబ్రిటీలు ఎవరూ కూడా ఇంట్లో నుండి బయటకు రావడం లేదు. ఎవరికీ వారు ఇంట్లోనే ఉండి సోషల్ మీడియా ద్వారా ఇంటర్వ్యూలు.. అభిమానులతో బాతాఖానీ చేస్తున్నారు. కొందరు సిని తారలు ఇంట్లోనే యూట్యూబ్ ఛానల్స్ లో వంటా వార్పు కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ సడలింపులు లభిస్తుంది కాబట్టి సినిమా షూటింగులు జరుపుకునేందుకు అనుమతి ఈ మధ్యే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఆ అనుమతి కూడా అతి తక్కువ మందితో షూటింగ్ జరుపుకునేందుకు మాత్రమే. ఇక ఈ మధ్య కాలంలో హాలీవుడ్ బాలీవుడ్ అనే కాదు ఇండియాలోని ప్రతీ ఇండస్ట్రీలో ముద్దు సీన్లు.. రొమాంటిక్ సీన్లు కామన్ అయిపోయాయి.ఇవి లేకుంటే సినిమాలు చూసేందుకు యువ ప్రేక్షకులు కూడా పెద్దగా ముందుకు రావట్లేదు. కానీ తాజాగా కరోనా పుణ్యమా అని.. ఇక పై సినిమాలలో ముద్దు సీన్లు బెడ్ సీన్లు ఉండకపోవచ్చు. ఎందుకంటే కరోనా కారణంగా ఇలాంటి సన్నివేశాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని టాక్. ఇక ఈ రొమాంటిక్ సన్నివేశాల పై టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి సంచలన వ్యాఖ్యలు చేసింది. లాక్ డౌన్ తరువాత నేను ముద్దు సీన్లలో నటించనని స్ట్రెయిట్ గా చెప్పేస్తోంది లావణ్య బ్యూటీ.  అదేంటని అడిగితే.. ఎందుకైనా మంచిదని ముందుగానే ఈ విషయాన్ని చెప్తున్నా.. అని అంటోంది అందాల రాక్షసి. ఒకప్పుడు బికినీకి సిద్ధమని ఇప్పుడు ముద్దు కూడా వద్దంటుందని ఆశ్చర్య పోతున్నారు. ఇదిలా ఉండగా ప్రసుత్తం లావణ్య చేతిలో ఇద్దరు యంగ్ హీరోల సినిమాలు ఉన్నాయి. ఒకటి.. ఏ1 ఎక్స్ ప్రెస్ మరోటి చావు కబురు చల్లగా. అలాగే వరుణ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమాలో కూడా కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.