గొడుగు పట్టేందుకొకడు.. చీర కుచ్చిళ్లు మోసేందుకొకడు!

Wed Jul 06 2022 10:32:38 GMT+0530 (India Standard Time)

Nora Fatehi Trolled For Saree Holding

ఆమెకు గొడుగు పట్టేందుకొకడు.. పవిట కొంగు చీర కుచ్చిళ్లు మోసేందుకొకడు!.. ఇద్దరు గార్డులు అవసరమైంది. చూసేందుకే ఆ సన్నివేశం ఎంతో సినిమాటిగ్గా ఉంది. ఆమెకు గొడుగు పట్టనిదే.. చీర కొంగు సవరించనిదే ఒకటో తారీఖు అకౌంట్లో జీతం పడదు! అన్నట్టుగానే ఉంది ఈ సన్నివేశం. ఇంతకీ నోరా తన గార్డుల్ని బానిసలుగా చూస్తోందా?కానీ ఆ సందర్భం అలాంటిది. అసలే రాజవాకాంగనను తలపించే నోరా ఫతేహి పింక్ డిజైనర్ శారీలో అలా కార్ నుంచి కాలు బయటపెడుతోంది. కానీ అప్పటికే వర్షం జోరున కురుస్తోంది. ఇంకేం చేయాలి. తనకు గొడుగు పట్టకపోతే తడిసిపోతుంది. ఆ పొడవాటి పవిట కొంగు ఒంటిపై నిలిచేది తక్కువ కాబట్టి నీళ్లలో జారిపడకుండా పట్టుకునేందుకు ఇంకొక గార్డ్ అవసరమయ్యాడు. ఏదైనా అర్థం చేసుకునేవాళ్లను బట్టి ఉంటుంది. ఈ సన్నివేశానికి కొందరు నెటిజనులు సీరియస్ అవుతుంటే మరికొందరు అవసరమే కదా! అని సమర్థించే వాళ్లు లేకపోలేదు.

బాలీవుడ్ నటి నోరా ఫతేహి డాన్స్ దీవానే జూనియర్స్ అనే రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.  నీతూ కపూర్ -మార్జీ పెస్టోంజీతో కలిసి నోరా జడ్జిమెంట్ ఇస్తున్నారు. ఇటీవల షో  ముగింపు షూట్ కోసం నోరా పింక్ చీరలో కనిపించింది. ముంబైలో భారీ వర్షాల మధ్య టీమ్ షూటింగ్ చేస్తోంది. నోరా తన టీమ్ సహాయం తీసుకుని కారు దిగి తన వానిటీ వ్యాన్ లోకి చేరుకుంది.

ఆ వర్షంలో సెక్యూరిటీ గార్డు నోరాకు చీర తడవకుండా సహాయం చేసాడు. తన వెంటే ఉండి.. ఆ కుచ్చిళ్లను పట్టుకుని తనతోనే వ్యాన్ వద్దకు నడవడం నెటిజనులకు ఆశ్చర్యం కలిగించింది. నిజానికి అదే ఎవరికీ నచ్చలేదు. దీనిపై తనను ట్రోల్ చేశారు. కొందరు నోరాను ఈ వైఖరి ఏంటీ? అని ప్రశ్నించారు. చీరను మోసుకెళ్ళడంలో సహాయం చేసినందుకు గార్డును నోరాను కూడా పలువురు నిందించారు.

వీడియోపై స్పందిస్తూ ఒక నెటిజన్ ఇలా వ్యాఖ్యానించాడు ''మీకు మీరు అదుపులో వుంచుకోగలిగే దుస్తులను ధరించండి'' అని రాయగా.. మరొకరు ''కాపలాదారుని బానిసగా ఉపయోగించుకోకండి.. సిగ్గుపడండి'' అని తిట్టాడు. ''ఒక పేద వ్యక్తి ఎల్లప్పుడూ ధనికుడికి మద్దతు ఇచ్చే ధైర్యం కలిగి ఉంటాడు. ఆ అబ్బాయికి హ్యాట్సాఫ్'' అని రాసారు. మరో నెటిజను ఇలా అన్నారు. పేదవాడా? ఆమె చీరను తీసుకువెళ్లడం కోసమే అతను వర్షంలో తడిసిపోయాడు...అని వ్యాఖ్యానించారు. డ్యాన్స్ దీవానే జూనియర్స్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో షంషేరా తారాగణం రణబీర్ కపూర్ - వాణీ కపూర్ లు ప్రత్యేక అతిథులు. ఈ షోకు కరణ్ కుంద్రా హోస్ట్ గా వ్యవహరించారు.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. నోరా ఫతేహి చివరిసారిగా భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియాలో అజయ్ దేవగన్ - సంజయ్ దత్- సోనాక్షి సిన్హా - అమీ విర్క్ లతో కనిపించారు. బుల్లితెర వెండితెరతో పాటు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ కోట్లలో ఆర్జిస్తూ నోరా గేమ్ ఆడుతోంది.