ఫోటో స్టోరి: నువు నడిచే దారి ఎరుపెక్కెనే మనోహరీ..!

Sun Jul 25 2021 18:00:02 GMT+0530 (IST)

Nora Fatehi Stuns You In Her Latest Click

బాలీవుడ్ హాటెస్ట్ డ్యాన్సింగ్ దివా నోరా ఫతేహీ హాట్ ఎక్స్ ఫోజింగ్ సెన్సేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియా జనాల్ని హీటెక్కించడం అమ్మడి ప్రత్యేకత. ఇన్ స్టా వేదికగా నోరాకి కోట్లాదిమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆ ఫాలోయింగ్ ని.. నోరాపై ఇంటెన్షన్ అలాగే కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటుంది. తాజాగా నోరా మరోసారి ఎరుపు వర్ణం గౌనులో టాప్ లేపింది. భుజాలు ఓపెన్ గా కనిపించేలా స్పెషల్ రెడ్ గౌనులో కుర్రాళ్లకు మత్తాక్కిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టా ఫాలోవర్స్ ని ఊపేస్తోంది.లాక్ డౌన్ తర్వాత కేవలం ఫోటో షూట్లపైనే ఫోకస్ పెట్టిన నోరా ఫ్యాన్స్ కి అన్ లిమిటెడ్ ట్రీట్ తో టచ్ లో ఉంటోంది. ఇక కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం `భుజ్`: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ లో నటిస్తోంది. ఇందులో అజయ్ దేవ్‌గన్- సంజయ్ దత్ తదితరులు నటిస్తున్నారు. మరో హీరోయిన్ గా సోనాక్షి సిన్హా నటిస్తోంది. 1971 లో జరిగిన ఇండో-పాక్ వార్ నేపథ్యంతో తెరకెక్కుతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్ విజయ్ కార్నిక్ కథ ఇందులో ప్రధానంగా హైలైట్ కానుంది. అలాగే జాన్ అబ్రహం నటిస్తోన్న `సత్యమేవ జయతే -2` లో నోరా స్పెషల్ అప్పీరియన్స్ లో కనిపించనుంది.

ఇక తెలుగు ప్రేక్షకులకు నోరా బాగా సుపరిచితురాలే. `టెంపర్`.. `బాహుబలి`.. `కిక్ -2`.. `షేర్`..`లోఫర్` చిత్రాల్లో హాట్ ఐటం గాళ్ గా మెప్పించిన సంగతి తెలిసిందే. `బాహుబలి` సినిమాతో నోరాకి టాలీవుడ్ లో మంచి ఐడెంటీటి దక్కింది. మరోవైపు పాప్ సింగర్ గానూ నోరా బాగా ఫేమస్. మంచి డాన్సర్ కావడంతో చాలా ఆల్బమ్స్ స్వయంగా చేసింది. వాటికి మార్కెట్ లో మంచి గిరాకీ ఉంది. దిశాపటాని లాంటి నటులకు మంచి డాన్సింగ్ గురువుగాను పేరు తెచ్చుకుంది. వీలుంటే ఇండియన్ వెర్షన్ సూపర్ గాళ్ పాత్రలో నటించాలన్నది నోరా కోరిక. కానీ అది ఇప్పట్లో నెరవేరేట్టు కనిపించడం లేదు.