ముత్యం మెరుపులతో మతి చెడగొట్టిన మనోహరి

Fri Jan 22 2021 13:20:27 GMT+0530 (IST)

Nora Fatehi Latest Stunning Look

బాహుబలి మనోహరిగా మొరాకో బ్యటీ నోరా ఫతేహి తెలుగు యూత్ గుండెల్లో సాలిడ్ గా సెటిలైంది. బాలీవుడ్ టు టాలీవుడ్ ఈ అమ్మడి పేరు మార్మోగుతోంది. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులకు కంటిన్యూగా టచ్ లో ఉంది. నోరా ఎక్కడ ఏం చేసినా దాని గురించి తెలుగు యువత ఇన్ స్టా వేదికగా ముచ్చటిస్తుంది.అంతగా మన యూత్ మనసు దోచింది.  ఇక నోరా ఫతేహి రెగ్యులర్ ఫ్యాషన్ షోస్ ఇన్ స్టా వేదికగా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇటీవల ప్రింటెడ్ కో-ఆర్డర్ బ్లౌజ్ స్కర్ట్ డ్రెస్  లో కొన్ని ఫోటోల్ని పంచుకోగా అవి వైరల్ గా మారాయి. ఇదివరకూ రకరకాల డ్యాన్సింగ్ జిమ్మింగ్ యోగా వీడియోలు.. జనంలోకి వైరల్ గా వెళ్లాయి.

దేవతా సుందరిని తలపించే నోరా నెవ్వర్ బిఫోర్ అనిపించే మరో ఫోటోని తాజాగా షేర్ చేసింది. తళతళా మెరుస్తున్న ముత్యాలతో డిజైన్ చేసిన ఒక ప్రత్యేకమైన టాప్ ని ధరించి దానికి కాంబినేషన్ గా మెడలో ముత్యం రంగు హారాన్ని తలపించే వస్త్రాన్ని ధరించింది. ఈ రూపం నిజంగా దేవతా సుందరినే తలపిస్తోంది. ఒక రకంగా మొరాకో బ్యూటీ అందచందాలు మతి చెడగొడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఈ డిజైనర్ లుక్ యువతరంలో వైరల్ గా మారింది.

నోరా ఇటీవలే ఓ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చి హెడ్ టర్నర్ అనిపించుకుంది. కరీనా కపూర్ వారసుడు తైమూర్ పెద్దయ్యాక వివాహం చేసుకుంటానన్న కోరికను నోరా వ్యక్తం చేసింది. కరీనా టాక్ షో `వాట్ ఉమెన్ వాంట్` లో నోరా కనిపించింది. బెబో భర్త సైఫ్ అలీ ఖాన్ నోరా నృత్య కదలికలను ప్రేమిస్తున్నారని చెప్పినప్పుడు.. నోరా  ప్రతిస్పందన కరీనాను స్టంప్ బౌల్డ్ చేసింది. ``తైమూర్ పెద్దయ్యాక.. నాకు తనతో నిశ్చితార్థం లేదా వివాహం గురించి ఆలోచించవచ్చని నేను ఆశిస్తున్నాను`` అంటూ షాక్ కి గురి చేసింది. ఫిబ్రవరిలో సైఫ్ అలీ ఖాన్ తో తన రెండవ బిడ్డను ఆశిస్తున్న కరీనా కొన్ని సెకన్ల పాటు మాటలు లేకుండా అయిపోయింది. ఆపై ఆమె నవ్వి .. సరే.. ఆయనకు నలుగురు. నేను చాలా దూరం వెళ్ళాలని అనుకుంటున్నాను.. అంటూ వినోదాన్ని కటిన్యూ చేసింది.  సరే.. నేను వేచి ఉంటాను అంటూ నోరా ఆన్సర్ ఇచ్చింది.

సత్యమేవ జయతే చిత్రం నుండి దిల్బార్ .. బట్ల హౌస్ నుండి ఓ సాకి సాకి .. స్ట్రీట్ డాన్సర్ 3 డి నుండి గార్మి పాటలు వైరల్ అయిన తరువాత నోరా ఫతేహి రేంజ్ స్కైని టచ్ చేసింది. ప్రస్తుతం `భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా`లో  నోరా ఒక కీలక పాత్రను పోషిస్తోంది.