బాహుబలి మనోహరి మళ్లొచ్చిందిలా

Thu Aug 09 2018 14:21:49 GMT+0530 (IST)

నడుము ఊపుతో నాగిని నాట్యమాడాలంటే మనోహరి నోరా ఫతేహి తర్వాతే. ఈ అమ్మడు ఇన్ స్టాగ్రమ్ వీడియోల్లో నాగిని నాట్యం చూసి గుండె ఆగి `పోయిన`వాళ్లున్నారు. బాహుబలుడు ప్రభాస్ సరసన .. మనోహరి పాటలో చూపించింది వీసమెత్తు. నాలో అంతకుమించి శిరులున్నాయ్ .. దోచుకునే వాళ్లకు దోచుకున్నన్ని! అంటూ దోసిళ్లతో ఒలకబోస్తోంది ఈ అమ్మడు.అవి ఎంత తోడినా తరగని శిరులు. గాలి జనార్ధన్ గనిలా తళాంగుతళుకులన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. పోల్ డ్యాన్స్ - ర్యాప్ డ్యాన్స్ - ఫ్లోర్ డ్యాన్స్ - బెల్లీ డ్యాన్స్ - బ్రేక్ డ్యాన్స్ పేరు ఏదైనా చితకేయడం నోరా ప్రత్యేకత. ఇదిగో మరోసారి ఆ రేంజులోనే విరుచుకుపడింది ఈ వీడియోలో. నోరాలో ఎన్నిరకాల చమక్కులున్నాయో అన్నిటినీ రంగరించిందిక్కడ.

రాజ్ కుమార్ రావ్ - శ్రద్ధా కపూర్ జంటగా అమర్ కౌశిక్ దర్శకత్వంలో దినేష్ విజాన్ - తెలుగు కుర్రాళ్లు రాజ్& డీకే నిర్మిస్తున్న `స్త్రీ` చిత్రంలోనిది ఈ ప్రత్యేక గీతం. `కమారియా .... ` అంటూ సాగుతున్న ఈ ప్రత్యేక గీతంలో నోరా ఫతేహి ఇంచు ఇంచు అందాలతో కవ్వించింది. వేడెక్కించే నాగిని నాట్యంతో ఉరకలెత్తించింది. నోరా గ్లింప్స్ క్యాచ్ చేసేందుకు యూత్ మళ్లీ మళ్లీ మీట నొక్కుతారనడంలో సందేహం లేదు. ఇదివరకూ `దిల్ బార్` పాటలోనూ ఇదే రేంజులో చెలరేగిన నోరా మరోసారి కసి తీర్చుకుంది. స్పైసీ స్పైసీ కమారియా.. జూసీ జూసీ కమారియా.. మీ కోసమే ఈ వీడియో గ్లింప్స్.. కాచుకున్నవాళ్లకు కాచుకున్నంత.. దోచుకున్నవాళ్లకు దోచుకున్నంత. ఆగస్టు 31న `స్త్రీ` ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రిలీజవుతోంది.


వీడియో కోసం క్లిక్ చేయండి