Begin typing your search above and press return to search.

నోరా ఫ‌తే : బ్యూటీ ఇన్ వైట్‌

By:  Tupaki Desk   |   25 Sep 2021 6:30 AM GMT
నోరా ఫ‌తే : బ్యూటీ ఇన్ వైట్‌
X
కెన‌డా మెడ‌ల్‌.. న‌టి నోరా ఫ‌తే నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది. సినిమాల్లో అత్య‌ధిక శాతం న‌టించింది ప్ర‌త్యేక గీతాల్లోనే అయినా హీయిన్ తర‌హాలో మాత్రం క్రేజ్‌ ని సొంతం చేసుకుంది. ఇక టాలీవుడ్ సెన్సేష‌న‌ల్ మూవీ `బాహుబ‌లి ది బిగినింగ్‌`లోని `మ‌నోహ‌రీ.. అంటూ సాగే ప్ర‌త్యేక గీతంలో మెరుపుతీగ‌లా త‌న ఒంపు సొంపుల‌తో మెరిసి కుర్రాళ్ల మ‌తులు పోగొట్టింది.

హిందీ చిత్రం `రోర్ : టైగ‌ర్స్ ఆఫ్‌ ది సుంద‌ర్‌ బ‌న్స్‌`తో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది. ఆ త‌రువాత క్రేజీ కుక్క‌డ్ ఫ్యామిలీ`లోనూ మెరిసింది. ఆ త‌రువాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన `టెంప‌ర్‌` మూవీలోని `ఇట్టాగె రెచ్చిపోదాం పిల్లా.. ` సాంగ్‌ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సాంగ్‌ తో హాట్ అందాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని మెస్మ‌రైజ్ చేసింది. అక్క‌డి నుంచి మొద‌లైన నోరా ప్ర‌త్యేక గీతాల ప్ర‌యాణం ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే వుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు..త‌మిళ‌..మ‌ల‌యాళ‌.. హిందీ భాష‌ల్లో 13 చిత్రాల్లోని ప్ర‌త్యేక గీతాల్లో న‌టించి త‌న‌దైన ప‌రువాల‌తో కుర్రకారుని హీటెక్కించింది. పాట‌ల్లోనే కాకుండా ప్ర‌త్యేక ఫొటోషూట్ ‌ల‌తోనూ సోష‌ల్ మీడియాని హీటెక్కించేస్తోంది. తాజాగా వైట్ అండ్ వైట్ డ్రెస్‌ లో త‌న యెద అందాలని ప్ర‌ద‌ర్శిస్తూ నోరా షేర్ చేసిన ఫొటోలు ఆమె ఫ్యాన్స్‌ ని ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ ఫొటోల్లో ఆమెని చూసిన వారంతా బ్యూటీ ఇన్ వైట్ అంటూ కామెంట్‌ లు చేస్తున్నారు.