టన్నుల్లో నాన్ వెజ్ వంటకాలు..ఘుమ ఘుమలు!

Fri Sep 30 2022 10:15:33 GMT+0530 (India Standard Time)

Non-veg dishes in tons.

రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ నిన్నటి రోజున పశ్చిమగోదావరి జిల్లా  మొగల్తూరులో నిర్వహించిన సంగతి   తెలిసిందే . ఈ కార్యక్రమానికి కుటుంబభ్యులతో పాటు ప్రభాస్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానుల కోసం ఏర్పాటు చేసిన భోజన ఏర్పాట్లు అంబరాన్ని అంటాయి. వెజ్-నాన్ వెజ్ వెంటకాలతో జిల్లా మొత్తాన్ని ఘుమ ఘుమలాడించారు.కేవలం అభిమానుల కోసమే ఈ రేంజ్లో ఏర్పాట్లు చేసారు. సంస్మరణ సభకు వచ్చిన ప్రతీ అభిమాని కడుపునిండా తిని వెళ్లాలని ఈ రకమైన ఏర్పాట్లు చేసారు. ఇక కృష్ణంరాజు అంటే నాన్ వెంజ్ వంటకాలు ఎలా ఉంటయో చెప్పాల్సిన పనిలేదు. నిన్నటి రోజున ఆయనకు ఇష్టమైన అన్ని రకాల నాన్ వెజ్ వంటకాలు..స్పెషల్ డిషెస్ రెడీ చేసారు.

నిన్నటి రోజున మెనూ చూస్తూ ఆశ్చర్యపోవాల్సిందే. ఇదంతా కేవలం అభిమానుల కోసమే చేసారా? అంటే ఇంకా ఆశ్చర్యపోతాం. ఓసారి మెనూ చూస్తే..

దాదాపు లక్ష మందికి నాన్ వెజ్ వంటకాలు సిద్దం చేసారు.  ఆరు టన్నుల మటన్ కర్రీ... ఆరు టన్నుల మటన్ బిర్యానీ.. ఆరు టన్నుల చికెన్ బిర్యానీ.. ఆరు టన్నుల చికెన్ కర్రీ..చికెన్ ప్రై నాలుగు టన్నులు.. పండుగప్ప చేప కర్రీ టన్ను..చందువా ఫిష్ ప్రై టన్ను..చిట్టి చేపల పులుసు రెండు టన్నులు..నెత్తెల 65 టన్ను... టన్ను బొమ్మిడాల పులుసు.. టన్ను పీతల కూర... టన్ను రొయ్యల ఇగురు.. గోంగూర రొయ్లయ ఇగురు టన్ను..రెండు లక్షలు బూరెలు ఇలా దాదాపు పలు రకాల ప్రత్యేక వంటకాలు అభిమానులకు రుచి చూపించినట్లు తెలుస్తోంది.

అలాగే 22 రకాల వెజ్ వంటకాలు ప్రత్యేకంగా తయారు చేయించారు. తమ సంప్రదాయ ప్రకారం సంస్మరణ సభని ఎంతో ఘనంగా నిర్వహించినట్లు తెలుస్తోంది.  దీంతో రాజు ఎక్కడున్నా? రాజేరా అంటే 'బాహుబలి'లో బిజ్జలదేవ డైలాగ్ తో  అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇది కనివిని ఎరుగని సంస్మరణ సభ..చరిత్రలో నిలిచిపోయే సభ అంటూ అభిమానులు కొనియాడుతున్నారు.

కృష్ణంరాజు మంచి నాన్ వెజ్ ప్రియుడు. ఉదయం టిఫిన్ నుంచి రాత్రి వరకూ ఇంట్లో అన్ని రకాల నాన్ వెజ్ వంటకాలతోనే రోజు ముగించేవారు.  ఆయనకు చిన్న నాటి నుంచి ఉన్న అలవాటు ఇది.  అందుకే ఆయనకు ఇష్టమైన అన్ని రకాల వంటకాల్ని  అభిమానులకు రుచి చూపించారు. వంటకాలు తయారు చేయడం కోసం హైదరాబాద్ నుంచి కొంత మందిని..పశ్చిమగోదావరి జిల్లా నుంచి మరికొంత మందిని దాదాపు 1000 మంది వంట కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.