జాతీయ అవార్డు వచ్చిన సినిమా దర్శకుడి కి నో ఆఫర్స్!

Tue Dec 06 2022 14:00:01 GMT+0530 (India Standard Time)

No offers with the over action of the director of the national award winning film

ఒక్క సినిమా హిట్ అయితే చాలు ఆ దర్శకుడి చుట్టు ఎంతో మంది నిర్మాతలు చేరుతారు.. ఎంతో మంది యంగ్ హీరోల నుండి స్టార్ హీరోల వరకు చేరుతారు. ఇండస్ట్రీలో ఒక్క సూపర్ హిట్ తో అడుగు పెడితే ఆ దర్శకుడిని దేవుడు అన్నట్లుగా చూస్తారు. అలాంటి క్రేజ్ ఒక యంగ్ దర్శకుడికి వచ్చింది.ఆయన తెరకెక్కించిన సినిమాకు ఏకంగా జాతీయ అవార్డు వచ్చింది. అలాంటి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ఇప్పటి వరకు తన తదుపరి సినిమా ను మొదలు పెట్టలేదు. యంగ్ దర్శకుడిగా మంచి ఫ్రెష్ కథలు మరియు కాన్సెప్ట్ లు ఉండి ఉంటాయి అని చాలా మంది నిర్మాతలు ఆయన్ను అప్రోచ్ అవుతున్నారట.

కానీ ఆయన మాత్రం ఇంకా ఏది స్టార్ట్ చెయ్యలేదని టైం వేస్ట్ చేస్తున్నాడని.. ఆయన దర్శకత్వంలో గతంలో సినిమాలు నిర్మించాలి అనుకున్న వారు కూడా ఇప్పుడు ఆ ఆలోచన ను పక్కకు పెట్టేస్తున్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఆ దర్శకుడి నుండి ముందు ముందు మరిన్ని మంచి సినిమాలు వస్తాయి అనుకుంటే అసలు ఆఫర్లు లేకుండా పోయాయి. హీరోలు యాటిట్యూడ్ చూపిస్తే ఏమో కానీ ఇలా దర్శకులు యాటిట్యూడ్ చూపిస్తే మంచిది కాదని నిర్మాతలు అంటున్నారు. అందుకే ఆయన తో సినిమాలకు నిర్మాతలు మరియు హీరోలు కూడా ఇప్పుడు ఆసక్తిగా లేరు.

ఇప్పటికైనా ఆ యువ దర్శకుడు తన యాటిట్యూడ్ ను తగ్గించుకుని నిర్మాతల వద్ద మరియు హీరోల వద్ద తన ప్రతిభను చూపిస్తే అప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తాయి.. ప్రేక్షకుల ముందుకు మంచి సినిమాలు వస్తాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు కామెంట్స్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.