Begin typing your search above and press return to search.

ఎంత రంగ‌రించినా ఏం లాభం నేహా..! ఎన్నాళ్ల‌ని ఇలా!!

By:  Tupaki Desk   |   18 April 2021 6:50 AM GMT
ఎంత రంగ‌రించినా ఏం లాభం నేహా..! ఎన్నాళ్ల‌ని ఇలా!!
X
సోష‌ల్ మీడియా క్వీన్ నేహా శ‌ర్మ రెగ్యుల‌ర్ ఫోటో వీడియో ట్రీట్ గురించి చెప్పాల్సిన‌దేమీ లేదు. ఇప్ప‌టికే ఇన్ స్టా వేదిక‌గా ఈ అమ్మ‌డికి అసాధార‌ణ ఫాలోయింగ్ పెరిగింది. తాజాగా నేహా మ‌రో వేడెక్కించే వీడియోని ఫోటోల్ని ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి.

ఇక ఈ వీడియోకి ఫోటోల‌కు బ్లాక్ అండ్ వైట్ అని హ్యాష్ ట్యాగ్ ని జోడించింది నేహాశ‌ర్మ‌. నిజానికి ఈ వీడియోలో బ్లాక్ ఫ్రాక్ కి కాంబినేష‌న్ గా వైట్ స్కిన్ తో మెరిసిపోతోంది నేహా. నేహా వైట్ స్కిన్ టోన్ కి త‌గ్గ‌ట్టే గోల్డ్ పెండెంట్ మెడ‌లో వేలాడుతోంది. ఈ లుక్ వ‌ల్ల‌నే ఈ క్యాప్ష‌న్ ఇచ్చింది! అని అభిమానులు భావిస్తున్నారు. రాజుల ప్రాకారం లాంటి ఇంటీరియ‌ర్ ఆర్కిటెక్చ‌ర్ ఉన్న ఇంట్లో ఈ ఫోటోగ్ర‌ఫీ ఆక‌ట్టుకుంటోంది. ఫోటోల‌న్నీ బ్లాక్ అండ్ వైట్ లో ఇంప్రెస్సివ్ గా క‌నిపిస్తున్నాయి.

తానాజీ 3డి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో న‌టించిన నేహా శ‌ర్మ 2020లో హేరాఫేరీ 3 అనే భారీ చిత్రానికి సంత‌కం చేసింది. కానీ ఈలోగానే మ‌హ‌మ్మారీ వెంట‌ప‌డి త‌రిమింది. కెరీర్ మేలి మలుపులో మ‌హ‌మ్మారీ ముస‌లంలా అంటుకుని వ‌ద‌ల‌డం లేదు. పాపం నేహా ఆశ‌ల‌న్నిటినీ అలా అడియాస‌లు చేస్తోంది కాలం.