Begin typing your search above and press return to search.

ఓటీటీ సెన్సార్.. కేంద్రానికి మూడ్ లేదు!

By:  Tupaki Desk   |   19 Nov 2019 2:30 PM GMT
ఓటీటీ సెన్సార్.. కేంద్రానికి మూడ్ లేదు!
X
వెబ్ ఆధారిత మాధ్య‌మాల్లో న్యూడిటీ విస్త్ర‌తంగా పెరుగుతోంది. యూట్యూబ్ పెనుపోక‌డ‌ల గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. సోష‌ల్ మీడియాల్లోనూ బూతు విప‌రీతంగా పెరిగిపోతోంది. ఇక ఇదంతా ఒకెత్తు అనుకుంటే ఇప్పుడు ఓటీటీ డిజిట‌ల్ కంటెంట్ పేరుతో అస‌లు సెన్సార్ అన్న‌దే లేని ఒక అతి పెద్ద ఎంట‌ర్ టైన్ మెంట్ జోన్ త‌యారైంది. స్మార్ట్ యుగంలో యూత్ స్మార్ట్ ఫోన్ లో వెబ్ సిరీస్ లు.. డాక్యుమెంట‌రీలు.. షార్ట్ మూవీస్ అన్నిటినీ ఓటీటీ/ యూట్యూబ్ వేదిక‌పైనే చూస్తున్నారు. ఆ క్ర‌మంలోనే పిల్ల‌లు.. యువ‌త‌రంపై ఇది చెడు ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంద‌ని తీవ్ర దుమారం చెల‌రేగుతోంది.

టిక్ టాక్ లాంటి మాధ్య‌మ‌మే సంఘంలో కిల్ల‌ర్స్ ని త‌యారు చేస్తుంటే యూట్యూబ్/ డిజిట‌ల్ మాధ్య‌మం ఇంకా ఎన్నో రెట్లు విస్త్ర‌త‌మైన వేదిక‌ ఇంకెలాంటి దుష్ప‌రిమాణాల‌కు కార‌ణ‌మ‌వుతుందో ఊహించ‌న‌ల‌వి కాదు. అందుకే ఓటీటీ వేదిక‌పై సెన్సార్ షిప్ త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని ఉద్య‌మాలు పోరాటాలు సాగుతున్నాయి. ఇప్ప‌టికే కోర్టుల ప‌రిధికి చేరుకుంది ఈ పంచాయితీ. అయితే ఓటీటీ సెన్సార్ షిప్ పై కోర్టులు ప్ర‌భుత్వాలు కేంద్ర మినిస్ట్రీలు ఏం తేల్చాయి? అన్న‌దానికి ఇన్నాళ్లు స‌రైన ఆన్స‌ర్ లేదు. తాజాగా కేంద్ర స‌మాచార శాఖ నుంచి నేరుగా ఆన్స‌ర్ దొరికింది.

ఓటీటీ అనేదానికి స‌రిహ‌ద్దులు అనేవి లేవు. లిమిటేష‌న్స్ అస‌లే లేవు. ఇది టీవీ ఆడియెన్ కంటే విభిన్న‌మైన‌ది. అందుకే ఓటీటీపై సెన్సార్ చేయాల‌నే ఆలోచ‌న ఏదీ ప్ర‌భుత్వం వ‌ద్ద లేనేలేదు అని తెలిసింది. ఆ మేర‌కు స‌మాచార‌ప్ర‌సారాల శాఖ మంత్రి అమిత్ ఖ‌రే వెల్ల‌డించిన వివ‌రాల‌తో ఓటీటీ వేదిక‌లో హ‌ర్షం వ్య‌క్త‌మవుతోంది. ఇప్ప‌టికే ఈ వేదిక‌పై వెబ్ సిరీస్ ల హ‌వా పెరుగుతోంది. క్రియేటివిటీకి ఆస్కారం ఎక్కువే కనిపిస్తోంది. ఇక ప్ర‌తిదానికీ క‌ట్ట‌డి పేరుతో క‌త్తెర వేసే అడ్డంకి లేక‌పోవ‌డంతో మ‌న ద‌ర్శ‌కులు చెల‌రేగుతున్నారు. హార‌ర్ థ్రిల్ల‌ర్ లు .. మ‌ర్డ‌ర్ క‌హానీలు .. ఎరోటిక్ ప్రేమ‌క‌థ‌లు .. రియ‌లిస్టిక్ డిజాస్ట‌ర్ స్టోరీస్ వంటి వాటిని ఈ వేదిక‌పై ప్రేక్ష‌కుల‌కు చేరువ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్- నెట్ ఫ్లిక్స్- హాట్ స్టార్- జీ5 వంటి ఓటీటీ వేదిక‌ల‌పై ఇప్ప‌టికే భారీగా వెబ్ సిరీస్ లు.. డాక్యు సిరీస్ లు చూసేందుకు జ‌నం అల‌వాటు ప‌డ్డారు. ఇలాంటి వారికి ఎంతో ప‌ద్ద ఊర‌ట‌నిచ్చే నిర్ణ‌య‌మే ఇద‌ని చెప్పాలి.