Begin typing your search above and press return to search.

హృతిక్ రోష‌న్ నోట‌ సౌత్ టాపిక్ లేనే లేదు!

By:  Tupaki Desk   |   16 Aug 2022 8:39 AM GMT
హృతిక్ రోష‌న్ నోట‌ సౌత్ టాపిక్ లేనే లేదు!
X
బాలీవుడ్ లో ఖాన్ హీరోలకు పోటీగా..ధీటుగా నిల‌బ‌డిన ఒకే ఒక్క స్టార్ హృతిక్ రోష‌న్. ఎంత‌మంది ఖాన్ లొచ్చినా హృతిక్ ని ఇంచు కూడా క‌ద‌ల‌ప‌లేరు. ఖాన్ హీరోలంతా ఒక‌వైపు ఉంటే? హృతిక్ మాత్రం ఒవైపు ఉంటూ త‌న మార్క్ చిత్రాల‌తో ఉత్త‌రాది ప్రేక్ష‌కాభిమానుల్ని మెప్పించడం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. ఈ విష‌యంలో ఇండ‌స్ర్టీ హృతిక్ ని ఎంతో వేరు చేసి చూస్తుంది.

అయినా వాటిని ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా హృతిక్ పంథాలో సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్లిపోతుంటారు. హృతిక్ లో ఇది ఓ యూనిక్ క్వాలిటీ గా బాలీవుడ్ భావిస్తుంది. అలాగ‌ని ఖాన్ హీరోలు అత‌నికి వ్య‌తిరేకం కాదు. వృత్తిప‌రంగా అంతా క‌లిసి ప‌ని చేస్తారు. ఒక‌రు చిత్రాల్లో మ‌రొక‌రు గెస్ట్ అప్పిరియ‌న్స్ ఇస్తుంటారు. రాకేష్ రోష‌న్ వార‌సుడిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన హృతిక్ ప్ర‌యాణం అసిస్టెట్ ద‌గ్గ‌ర నుంచి మొద‌లైంది.

అటుపై హీరోగా ఎదిగారు. ఎన్నో ఎత్తుప‌ల్లాలు చూసారు. షారుక్ ఖాన్ సినిమా 'కోయిలా'కి సైతం అసిస్టెంట్ గా డైరెక్ట‌ర్ గా ప‌నిచేసాడంటే హృతిక్ ప్ర‌యాణం ఎలా సాగింద‌న్న‌ది? అంచ‌నా వేయోచ్చు. ఇలా న‌టుడిగా ఎంట్రీ ఇవ్వ‌క ముందే గ్రీకుదేవుడ‌ అన్ని శాఖ‌ల‌పైనా ప‌ట్టు సాధించాడు. హీరోగా రెండు ద‌శాబ్ధాల ప్ర‌యాణంలో ఎన్నో జ‌య‌ప‌జ‌యాలు చూసారు.

అయితే తాజా సినారే లో ఇండ‌స్ర్టీ లో వ‌స్తోన్న మార్పులు చూస్తునే ఉన్నాం. స్థానికత చెరిగిపోతుంది. పాన్ ఇండియా..ఇండియ‌న్ సినిమా అంటూ సినిమా మార్కెట్ విధానం మారుతోంది. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ హీరోలంతా సౌత్ మార్కెట్ వైపు దృస్టి సారిస్తున్నారు. అమీర్ ఖాన్..షారుక్ ఖాన్..అమితాబ‌చ్చ‌న్...అక్ష‌య్ కుమార్..అజ‌య్ దేవ‌గ‌ణ్..స‌ల్మాన్ ఖాల్ లాంటి స్టార్స్ సౌత్ లోనూ రాణించాల‌న‌ని ఆశ‌ప‌డుతున్నారు.

దీనిలో భాగంగా వివిధ రూపాల్లో త‌మ సినిమాల్ని ఇక్క‌డి ఆడియ‌న్స్ కి అందించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా హీరోలంతా హైద‌రాబాద్ హ‌బ్ సినిమాలు ప్ర‌మోటో చేస్తున్నారు. టాలీవుడ్ తో ర్యాపో పెంచుకుంటున్నారు.

కానీ హృతిక్ మాత్రం ఇంకా ఇటువైపు చూసిన దాఖ‌లాలు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ప్ర‌స్తుతం హృతిక్..టైగ‌ర్ ష్రాప్ హీరోల‌గా 'విక్ర‌మ్ వేద' తెర‌కెక్కుతోంది. ఇది కోలీవుడ్ హిట్ రీమేక్ కాబ‌ట్టి సౌత్ లో రిలీజ్ చేసే అవ‌కాశం లేదు. మ‌రి అప్ క‌మింగ్ ప్రాజెక్ట్ ల‌తో నైనా హృతిక్ సౌత్ మార్కెట వైపు దృష్టి పెడ‌తారా? అన్న‌ది చూడాలి.