Begin typing your search above and press return to search.

NTR30 : దసరా కూడా పాయే.. ఆ విషయం క్లారిటీ ఏది?

By:  Tupaki Desk   |   7 Oct 2022 10:42 AM GMT
NTR30 : దసరా కూడా పాయే.. ఆ విషయం క్లారిటీ ఏది?
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా తో అంతర్జాతీయ స్థాయి సక్సెస్ ను దక్కించుకున్నాడు. విదేశీ మీడియా సంస్థలు కూడా కొమురం భీం యొక్క పాత్రను ఆ పాత్రలో నటించిన ఎన్టీఆర్ ను గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ కథనాలు రాసిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఎన్టీఆర్‌ తదుపరి సినిమా విషయమై అభిమానుల్లో అసహనం తీవ్రంగా వ్యక్తం అవుతోంది.

విదేశీ మీడియాతో కూడా ప్రశంసలు దక్కించుకున్న ఎన్టీఆర్‌ తదుపరి సినిమా విషయంలో నిర్ణయాన్ని వెంటనే తీసుకోలేక పోతున్నాడు అనే అసంతృప్తి ఫ్యాన్స్ లో వ్యక్తం అవుతోంది.

ఇప్పటికే ఎన్టీఆర్‌ మరియు కొరటాల శివ కాంబో మూవీ గురించి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ దసరాకు సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభంకు సంబంధించిన అప్‌డేట్‌ ఇస్తారని అంతా భావించారు.

కానీ దసరా వెళ్లి పోయింది.. దీపావళి కూడా రాబోతుంది. అయినా కూడా ఎన్టీఆర్‌ 30 గురించి ఎలాంటి అప్‌డేట్‌ ను ఎన్టీఆర్ వైపు నుండి కానీ కొరటాల వైపు నుండి కానీ రావడం లేదు.

దాంతో అసంతృప్తి మరింత ఎక్కువ అవుతుంది. మరీ ఇంత లేజీగా కొరటాల శివ వ్యవహరిస్తున్నారు ఏంటీ అంటూ చాలా మంది చాలా రకాలుగా ఆగ్రహంతో ఉన్నారు.

ఎన్టీఆర్‌ 30 అప్‌డేట్‌ ఈనెల 10న వస్తుందనే మరో ప్రచారం మొదలు అయ్యింది. షూటింగ్‌ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు.. అంతే కాకుండా హీరోయిన్ విషయంలో కూడా ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. అయినా స్క్రిప్ట్‌ వర్క్ పూర్తి కాకుండా హీరోయిన్ ను ఎలా కన్ఫర్మ్‌ చేస్తారు... సినిమా సెట్స్ పైకి వెళ్లే ముందు హీరోయిన్‌ విషయంలో ఒక స్పష్టత వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.