చరణ్.. ఎన్టీఆర్..ఆ ట్వీట్ వేయలేదేమీ?

Thu Jul 07 2022 17:00:01 GMT+0530 (India Standard Time)

No Tweet on Vijayendra Prasad

ప్రతీ సందర్భంలో సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా వేసే ట్వీట్ లు ప్రతీ ఒక్కరినీ ఎట్రాక్ట్ చేస్తుంటాయి. కొంత చాలా ప్రత్యేక సమయాల్లో మాత్రమే ట్వీట్ లు చేస్తుంటారు. అలా చేసే ట్వీట్ లు అటెన్షన్ క్రియేట్ చేస్తుంటాయి. ఏదైనా నచ్చిన బాగా మెచ్చిన సినిమా విషయంలోనే.. ఎవరిని అయినా అభినందించాల్సిన సమయంలోనో.. లేదా పాపులర్ సెలబ్రిటీలు మృతి చెందితేనో మన సెలబ్రిటీలు ట్వీట్ చేస్తుంటారు. రాజకీయాలపై మాత్రం చాలా అరుదుగా స్పందిస్తుంటారు.ఎలా స్పందిస్తే అది ఎటు దారితీస్తుందోఅని ఆలోచించి మరీ స్పందిస్తుంటారు. కొంత మంది ఇవన్నీ ఏవీ ఆలోచించకుండానే ట్వీట్ లు చేసేస్తుంటారు. వివాదాల్లో ఇరుక్కుంటుంటారు. అయితే తాజాగా బుధవారం స్టార్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి రైటర్ విజయేంద్ర ప్రసాద్ ని ఏపీ నుంచి రాజ్య సభకు నామినేట్ చేస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో తమిళనాడు నుంచి మాస్ట్రో ఇళయరాజాని పీటీ ఉషను రాజ్య సభకు ఎంపీలుగా నామినేట్ చేస్తున్నట్టుగా వెల్లడించారు.

దీనిపై చాలా మంది సినీ సెలబ్రిటీలు ట్వీట్ ల వర్షం కురిపించారు. మరీ ప్రధానంగా తెలుగు రైటర్ విజయేంద్రప్రసాద్ ని రాజ్యసభకు ఏపీ నుంచి నామినేట్ చేయడంపై కొంత మంది విమర్శలు చేస్తే మరి కొంత మంది ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ లు చేశారు. అందులో సినీ సెలబ్రిటీలు కూడా వున్నారు. అయితే ఇందులో ఇద్దరు స్టార్ హీరోలు లేకపోవడం ఆసక్తికర చర్చకు దారితీసింది.

రాజమౌళికి ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా పేరున్న ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్ ఎన్టీఆర్ మాత్రం స్పందించలేదు. రాజమౌళితో కలిసి ఎన్టీఆర్ స్టూడెంట్ నెం.1 సింహాద్రి యమదొంగ ట్రిపుల్ ఆర్ చిత్రాల్లో నటించాడు.

ఈ సినిమాల్లో సింహాద్రి యమదొంగ ట్రిపుల్ ఆర్ లకు విజయేంద్ర ప్రసాద్ కథలు అందించారు. ఇక రామ్ చరణ్ మగధీర 'ట్రిపుల్ ఆర్' చిత్రాలతో రాజమౌలి ఫ్యామిలీకి దగ్గరయ్యారు. ఫ్యామిలీ వ్యక్తి అయ్యారు. ఇలా రాజమౌళి ఫ్యామిలీతో అనుబంధం వున్న ఈ ఇద్దరు హీరోలు విజయేంద్ర ప్రసాద్ పై ట్వీట్ లు చేయకపోవడం నెట్టింట వైరల్ గా మారింది.

సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు చనిపోయిన విషయం తెలిసి ట్వీట్ లు వేసిన ఈ ఇద్దరు హీరోలు రాజమౌళి ఫాదర్ విషయంలో మాత్రం ట్వీట్ చేయకపోవడంతో సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఇదిలా వుంటే విజయేంద్ర ప్రసాద్ గురించి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ట్విట్ చేయకపోవడం పలువురికి షాకిస్తోంది. పవన్ నా అభిమాన హీరో అని మాట్లాడిన ఆయన గురించి ట్వీట్ చేయకపోవడం ఏంటని అంతా విస్తూ పోతున్నారట. మరి ఇప్పటికైనా స్టార్ హీరోలు స్పందిస్తారో లేదో చూడాలని నెట్టింట జోరుగా ప్రచారం నడుస్తోంది.