Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా ప్రాజెక్ట్ సిబ్బందికి జీతాలు ఆపేశారట...!

By:  Tupaki Desk   |   4 July 2020 3:30 PM GMT
పాన్ ఇండియా ప్రాజెక్ట్ సిబ్బందికి జీతాలు ఆపేశారట...!
X
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ అస్థవ్యస్తంగా మారిపోయింది. దీని ప్రభావం అన్ని రంగాల మీద పడింది. మన దేశంలో కూడా కరోనా లాక్‌ డౌన్‌ వలన అన్ని ఇండస్త్రీలు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. అంతేకాకుండా కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి.. మరికొన్ని సంస్థలు ఉద్యోగులను తొలగిస్తూ వచ్చాయి. ఇక ఉన్న కొద్దిమంది ఉద్యోగుల జీతాలతో కోతలు విధించాయి. పెద్ద పెద్ద కార్పొరేట్‌ కంపెనీలు సైతం ఉద్యోగాల తొలగింపు.. వేతనాల్లో కోతలు చేపట్టాయి. అయితే ఇప్పుడు లాక్ డౌన్ నిబంధనలు సడలింపులు ఇస్తుండటంతో ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చిత్ర పరిశ్రమపై కూడా కరోనా కోరలు చాచింది. గత నాలుగు నెలలుగా సినీ ఇండస్ట్రీ క్లోజ్ అవడంతో సినిమా మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల జీవితాలు అస్థవ్యస్తంగా మారిపోయింది.

ఈ క్రమంలో కొన్ని ప్రాజెక్ట్స్ అర్థాంతరంగా ఆగిపోవడంతో తమ సిబ్బందికి జీతాలతో కోతలు విధిస్తూ వచ్చాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కూడా తమ యూనిట్ సభ్యులకి కరోనా టైమ్ లో సగం జీతాలు మాత్రమే చెల్లిస్తున్నారట. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ సినిమాకి పనిచేసిన వారికి క్రిందటి నెల వరకు వర్క్ లేనప్పటికీ సగం జీతాలు చెల్లించారట. అయితే ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయ్యే దాకా జీతాలు చెల్లించడం కుదరదని చెప్పేశారట. ఇది యూనిట్ మొత్తానికా లేదా కొన్ని విభాగాలకి మాత్రమేనా అనే విషయం తెలియదు కానీ యూనిట్ లోని ఓ కీలక విభాగంలో మాత్రం టీమ్ మొత్తానికి మళ్లీ షూటింగ్ స్టార్ట్ అయ్యే వరకు జీతాలు వుండవని చెప్పినట్లు సమాచారం.

ఇప్పుడిప్పుడే షూటింగ్స్ స్టార్ట్ అవుతాయని అనుకుంటున్న ఈ సమయంలో ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం వలన ఆ భారీ ప్రాజెక్ట్ కి పెద్దగా మిగిలేది ఏమీ ఉండదు. అందులోనూ భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమా కావడం వలన సిబ్బందికి ఇచ్చే జీతాలు వారికి భారం అయ్యే అవకాశాలు లేవు. మరి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారని ఈ ప్రాజెక్ట్ లో వర్క్ చేసేవారు ఆలోచిస్తున్నారట. అయితే కరోనా రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతుండటం.. మళ్ళీ తిరిగి షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే దాని మీద క్లారిటీ లేకపోవడంతో జీతాలు ఆపేసి వుంటారని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. ఏదేమైనా ఇండియాలోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ లో కూడా జీతాలు ఆపేశారంటే ఆలోచించాల్సిన విషయమే..!