Begin typing your search above and press return to search.

ట్రైలర్ డే తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ సార్?

By:  Tupaki Desk   |   7 Feb 2023 10:08 AM GMT
ట్రైలర్ డే తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ సార్?
X
జాతీయ ఉత్త‌మ నటుడు ధనుష్ న‌టించిన‌ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం - వాతి ట్రైలర్ విడుదల తేదీని 8 ఫిబ్రవరి 2023 (బుధవారం)న విడుద‌ల చేస్తున్నామ‌ని అధికారికంగా ప్రకటించారు. వెంకీ అట్లూరి రచించి దర్శకత్వం వహించిన వాతీ 90ల నేప‌థ్యంలోని కథాంశంతో రూపొందింది.

వ్యాపార లాభాల కోసం పిల్లలకు విద్యను అందించే కార్పొరెట్ విద్యాసంస్థ‌ల‌కు వ్యతిరేకంగా ధనుష్ పోరాటం ఏమిట‌న్న‌ది తెర‌పైనే చూడాలి. ఇందులో ధ‌నుష్‌ జూనియర్ లెక్చరర్ గా నటించాడు.

అయితే త‌మిళంలో ప్ర‌మోష‌న్స్ పై దృష్టి పెట్టినంతగా తెలుగు రిలీజ్ పై దృష్టి సారించ‌క‌పోవ‌డం సందేహాల‌కు తావిస్తోంది. తెలుగులో సితార సంస్థ కీరోల్ పోషిస్తున్నా ఇప్ప‌టివ‌ర‌కూ 'సార్' కి ఎందుక‌ని ప్ర‌చారం లేదు? ఎందుక‌ని 'సార్' ని హైడ్ చేస్తున్నారు? అంటూ సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే సార్ ని దాచిపెట్ట‌డానికి కార‌ణం తెలుగు రాష్ట్రాల్లో విద్య‌ను అమ్ముకుంటున్న కార్పొరెట్ విద్యా సంస్థ‌ల అరాచ‌కాలకు వ్య‌తిరేక కథాంశంతో రూపొందిన చిత్రం కావ‌డంతో ఇక్క‌డ ప్ర‌చారం త‌గ్గించి అవాంత‌రాలు లేకుండా రిలీజ్ చేయాల‌న్న ప్లాన్ తో ఉన్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

వాతి ట్రైల‌ర్ తో పాటే తెలుగు ట్రైల‌ర్ విడుద‌ల‌వుతుందా? ట్రైల‌ర్ లాంచ్ తో పాటు ప్రీరిలీజ్ వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తారా లేదా? అన్న‌దానికి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

ధ‌నుష్ కి తెలుగులో మార్కెట్ అంతంత మాత్ర‌మే. సార్ రేంజును పెంచాలంటే ప్ర‌చార‌పుటెత్తుగ‌డ చాలా కీల‌కం. కానీ ఇక్క‌డ ఇప్ప‌టివ‌ర‌కూ స‌రైన ప్ర‌చారం లేక‌పోవ‌డం ర‌క‌ర‌కాల‌ సందేహాల‌కు తావిచ్చింది.

సంయుక్త మీనన్ ఈ చిత్రంలో క‌థానాయిక‌. వాతికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సితార ఎంటర్ టైన్మెంట్స్- ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ - శ్రీకర ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియో ద్వారా తమిళనాడులో పంపిణీ చేస్తున్నారు. 2023 ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.