2.0 అనుకుంటున్నారా.. ఏంటి దేవుడ!?

Fri Jan 11 2019 20:00:01 GMT+0530 (IST)

దేవుడికి ప్రమోషన్ ఎందుకు? అయినా దేవుళ్లకు ఆ అవసరం ఏంటి?  దేవుడు అంటేనే సర్వాంతర్యామి.  దేవుడికి అసలు మీడియాతో పనేలేదు. మీడియా అంటేనే దేవుడికి పెద్ద సుత్తి. అందుకే దేవుళ్లకు ప్రచారం అక్కర్లేదు. ఇటీవలి కాలంలో కొన్ని పెద్ద సినిమాల విషయంలో ఫీలింగ్ ఇలానే ఉంటోంది. పర్యవసానంగా మంచి సినిమా తీసినా జనాల దృష్టికి చేరువ కాలేక ఫలితం గాల్లో ఊగిసలాడుతోంది. కొన్ని సినిమాలకు రిలీజ్ ముందే బోలెడంత ప్రమోషన్ కొట్టేశాం కదా! అని ప్రచారం వద్దనుకుంటున్నారు. అలా ఇప్పటికే ఇటీవల ఓ మూడు సినిమాల ఫలితం విషయంలో తీవ్రంగా భంగ పడ్డాయి. ఆ మూడు సినిమాలు కంటెంట్ పరంగా చూడదగ్గవే. కానీ ఏం ప్రయోజనం .. టాలీవుడ్ లో సరైన ప్రచారం లేక ఫలితాల దగ్గర చతికిలబడ్డాయి.ఇదివరకూ రిలీజైన 2.0 చిత్రానికి అసలు ప్రచారమే అక్కర్లేదని సూపర్‌స్టార్ రజనీయే ప్రకటించడంతో టాలీవుడ్ లో నిజంగానే ఆ సినిమాకి ప్రచారం దక్కలేదు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద నిరాశ తప్పలేదు. చివరికి తెలుగు హక్కులు దక్కించుకున్న ఎన్వీఆర్ సినిమాస్ కి నష్టం తప్పలేదు. ఇటీవల ఎఫ్ 2 ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న దిల్ రాజు తాను ప్యాషన్ తో నే ఇటీవల కొన్ని సినిమాల్ని డిస్ట్రిబ్యూషన్ చేశానని నష్టాలొచ్చినా రిలీజ్ చేస్తున్నానని అన్నారంటే అందులో అంతరార్థం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే 2.0 రజనీ మానియాతో ఆడేస్తుందని భ్రమపడడంతో ప్రచారం లైట్ తీస్కుని సెల్ఫ్ గోల్ పెట్టుకున్నారు. దాంతో ఫలితం రివర్సయ్యింది. హిందీలో హిట్టయినా లోకల్ భాషల్లో ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పలేదు.

ప్రస్తుతం సంక్రాంతి సినిమాల పరిస్థితి అలానే ఉంది. అసలే బాలేదన్న టాక్ వచ్చేయడంతో తప్పనిసరిగా ప్రమోషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ప్రచారం పరంగా వెనకబడి పోవడం ఇంకా పెద్ద దెబ్బ కొట్టేస్తోంది. బాలయ్య బాబు కథానాయకుడు సన్నివేశం ఇదే. కథానాయకుడు దేవుడి సినిమానే.. కానీ ప్రచారం కావాలి కదా! అంటూ పంచ్ లు వేస్తున్నారు కొందరైతే. వాస్తవానికి సినిమా బావుంది అన్న టాక్ వస్తే చాలు ఊదరగొట్టుడు ప్రచారం చేసి దానిని మరింత పెద్ద హిట్ చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తుంటారు. అలాంటిది కథానాయకుడు విషయంలో ఏంటో ఇలా అవుతోంది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లు పండగల్లోనే ఖాళీగా దర్శనమిస్తున్నాయన్న గ్రౌండ్ రిపోర్ట్ కొన్నిచోట్ల నుంచి వస్తోంది. ఖాళీ థియేటర్లకు దేవుడు సాయం చేయడు కదా?  అంటూ ఓ వర్గం నుంచి సెటైర్లు పడుతున్నాయి. ఇక రేపు రిలీజవుతున్న ఎఫ్ 2 పరిస్థితి ఇలానే ఉంది. ఈ సినిమా ప్రచారంలో సరైన క్లారిటీ మిస్సవ్వడంతో ఇంత భారీ కాంపిటీషన్ నడుమ థియేటర్లను ఎలా పుల్ చేస్తారు? అన్న టాక్ ఫిలింసర్కిల్స్ లోనే వినిపిస్తోంది.