Begin typing your search above and press return to search.

కృతి శెట్టి రేంజ్ లో లేస్తుందనుకుంటే కనిపించకుండా పోయిందే

By:  Tupaki Desk   |   7 March 2021 8:30 AM GMT
కృతి శెట్టి రేంజ్ లో లేస్తుందనుకుంటే కనిపించకుండా పోయిందే
X
గత ఏడాది సమ్మర్ లో విడుదల అవ్వాల్సిన ఉప్పెన మరియు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా లు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఉప్పెన సూపర్‌ హిట్ గా నిలువగా 30 రోజుల్లో ప్రేమించడం సినిమా నిరాశ పర్చింది. గత ఏడాది కాలంగా ఉప్పెన సినిమా హీరోయిన్‌ కృతి శెట్టి మరియు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా హీరోయిన్‌ అమృత అయ్యర్‌ లు ఊరిస్తూ వచ్చారు. వీరిద్దరు కూడా టాలీవుడ్‌ లో మంచి గుర్తింపు దక్కించుకోవడం తో పాటు ఆ సినిమా లు విడుదల అవ్వడమే బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు దక్కించుకుంటారని అంతా నమ్మకం వ్యక్తం చేశారు. కృతి శెట్టి రేంజ్ లో ఆఫర్లు దక్కించుకుంటుంది అనుకున్న అమృత అయ్యర్‌ కనిపించకుండా పోయింది.

బ్యాక్ టు బ్యాక్‌ రెడ్‌ మరియు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమృత అయ్యర్‌ కు రెండు కూడా నిరాశ కలిగించాయి. దాంతో ఆమెను పట్టించుకునేందుకు ఫిల్మ్ మేకర్స్ ఆసక్తి చూపించడం లేదు. ఆమె మళ్లీ ఏదైనా ఆఫర్ దక్కించుకుంటే గొప్ప విషయంగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె తమిళంలో లిఫ్ట్‌ అనే సినిమా మాత్రమే చేస్తుంది. ఆ సినిమా విడుదల తర్వాత మళ్లీ అమృత అయ్యర్‌ సందడి ఏమైనా కనిపిస్తుందా అనేది చూడాలి. మరో వైపు కృతి శెట్టి ఏ రేంజ్ లో దూసుకు పోతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఉప్పెన విడుదల కాకముందే ఆఫర్లు దక్కించుకున్న కృతి శెట్టి ఇప్పుడు మరిన్ని సినిమాలకు ఒప్పందం చేసుకుంటుంది. దాదాపుగా నాలుగు అయిదు సినిమా లు ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.