Begin typing your search above and press return to search.

ఆ స్టార్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా లేదట!

By:  Tupaki Desk   |   22 April 2021 3:30 AM GMT
ఆ స్టార్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా లేదట!
X
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ నెలలో రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉండగా.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. కొరటాలతో చేయబోయే సినిమా ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమా. అంటే సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు హీరో - డైరెక్టర్. అయితే కొరటాల శివతో సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా పై సోషల్ మీడియాలో పలు ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి.

కొంతకాలంగా ఎన్టీఆర్ తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తుంది. అయితే తాజాగా అట్లీ ఎన్టీఆర్ తో పాటు దళపతి విజయ్ ప్రధాన పాత్రలలో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి. తాజాగా కోలీవుడ్ మీడియా ఈ వార్తలలో నిజం లేదని తేల్చి చెప్పేసింది. నిజానికి ఎన్టీఆర్ కొరటాలతో సినిమా తర్వాత ఏ దర్శకుడికి కమిట్ అవ్వలేదు. అలాగే డైరెక్టర్ అట్లీ కూడా ప్రస్తుతం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్నాడు అట్లీ. అలాగే ఇప్పట్లో ఎన్టీఆర్ తో గాని అటు దళపతి విజయ్ తో గాని సినిమా చేసే ఉద్దేశం అట్లీకి లేదని సమాచారం. ఏదైనా షారుఖ్ సినిమా తర్వాతే అంటున్నాడట. చూడాలి మరి త్వరలో డైరెక్టర్ నుండి రెస్పాన్స్ రానుందేమో!