ప్రభాస్ తర్వాతే ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా..!

Wed Nov 24 2021 12:44:45 GMT+0530 (IST)

No Matter How Big A Superstar Is After Prabhas

ఒక హీరో స్టార్ డమ్ ను ఆయన తీసుకునే పారితోషికం మరియు ఆయన నటించిన సినిమాల వసూళ్లను ఆధారంగా లెక్కిస్తారు అనడంలో సందేహం లేదు. సక్సెస్ లు ప్లాప్ లు మరియు వసూళ్లు ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ ను మించిన స్టార్ ఎవరు లేరు అంటూ అభిమానులు చాలా బలంగా చెబుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఏడాదికి మూడు నాలుగు సినిమాల చొప్పున చేస్తున్నాడు. అయినా కూడా ఆయన్ను మించిన స్టార్ ప్రభాస్ అంటూ బాలీవుడ్ ఫిల్మ్ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఎందుకంటే ప్రభాస్ ఒక్కో సినిమాకు వంద కోట్లకు పైగా పారితోషికంను అందుకుంటున్నాడు.ఇక రాధే శ్యామ్ మొదలుకుని స్పిరిట్ వరకు ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా వందల కోట్ల బడ్జెట్ తోనే రూపొందుతున్న విషయం తెల్సిందే. అందుకే ఆయన స్టార్ డమ్ అలా అలా పెరిగి పోతుంది అంటూ అభిమానులు అంటున్నారు. రాధే శ్యామ్ సినిమా దాదాపుగా అయిదు వందల కోట్ల బిజినెస్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇక ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా బడ్జెటే 500 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక సలార్ సినిమా రేంజ్ కూడా మామూలు ఏం కాదు. ప్రాజెక్ట్ కే సినిమా కోసం నాగ్ అశ్విన్ ఏకంగా హాలీవుడ్ నే దించేస్తున్నాడు. ఆ సినిమా బడ్జెట్ కూడా అదే రేంజ్ లో ఉంటుందట. ఇక స్పిరిట్ సినిమాకు గాను ప్రభాస్ ఏకంగా 150 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

స్పిరిట్ కు గాను ప్రభాస్ పారితోషికం 150 కోట్లు అయితే మేకింగ్ కు అయ్యే ఖర్చు ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ ప్రతి సినిమా కూడా భారీ బడ్జెట్ తో రూపొందబోతుంది. వసూళ్లు కూడా ఖచ్చితంగా అదే స్థాయిలో ఉంటాయి కనుక ప్రభాస్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కింగ్ అనడంలో సందేహం లేదు. బాలీవుడ్.. సౌత్ లో ఎంత పెద్ద స్టార్ అయినా ఇప్పుడు ప్రభాస్ తర్వాతే అంటూ అభిమానులు చెబుతున్నారు. ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా కనీసం 250 కోట్లు వసూళ్లు చేస్తే ప్రభాస్ రేంజ్ మరింతగా పెరగడం ఖాయం అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. 2025 వరకు ప్రభాస్ వందల కోట్ల సినిమాలు క్యూ కట్టి మరీ రాబోతున్నాయి. కనుక అప్పటి వరకు ప్రభాస్ ఇండియన్ బాక్సాఫీస్ బాద్ షా అంటున్నారు.