టాలీవుడ్ లో ఆ సందడి ఉన్నా నిర్మాతల్లో ఉత్సాహం ఏదీ?

Tue Sep 21 2021 22:00:01 GMT+0530 (IST)

No Happiness In Tollywood Producers

కరోనా క్రైసిస్ అంతా మార్చేసింది. రెండేళ్లుగా బొమ్మాళీలా వైరస్ వెంటాడుతూనే ఉంది. షూటింగులు బంద్.. థియేటర్ల బంద్ వాతావరణం నైరాశ్యం నింపింది. కానీ ఇప్పుడిప్పుడే కరోనా భయాందోళనల నుంచి బయటపడేందుకు వెసులుబాటు కనిపిస్తోంది.గత వారాంతం పరిశ్రమలోని చాలా వర్గాల్లో సంతోష కనిపించింది.  చాలా కాలం తర్వాత టాలీవుడ్ లో బిగ్ ఈవెంట్లతో సందడిగా ఉంది. SIIMA అవార్డ్స్ వరుసగా రెండు రోజులు జరుపుకున్నారు. లవ్ స్టోరీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా జరిగింది. ఇటీవల వరుసగా ప్రెస్ మీట్లు ఈవెంట్లతో సందడి నెలకొంది. గత వారంలో కూడా అనేక కార్యక్రమాలు జరిగాయి. ఇదంతా చూడటానికి చాలా బాగుంది. కానీ పరిశ్రమ బావుంది అనడానికి ఇవి సరిపోవు. షూటింగులు ఉన్నా సమస్యలు ఎన్నో. పెద్ద సినిమాల విడుదలలు లేవు. దీంతో చాలా నిరుత్సాహం కనిపిస్తోంది. మాంచి ఊపు తెచ్చే సినిమా ఒక్కటీ రాకపోవడమే దీనికి కారణం.

నిజానికి కోవిడ్ ఇంకా అంతం కాలేదు. రోజుకు వెయ్యి కేసులు భయపెట్టేవే. ప్రస్తుత పరిస్థితికి ఇంకా నిర్మాతలు భయపడుతున్నారు. దానికి మించి AP లో టికెట్ రేట్లు కూడా అడ్డంకిగా మారాయి. ఇరు రాష్ట్రాల సీఎంలు త్వరలో ఒక నిర్ణయానికి రావాలని చిరు వంటి వారు బహిరంగంగా అభ్యర్థించారు. కాబట్టి ఒక విధంగా పరిశ్రమలో కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తున్నా కొన్ని సమస్యలు మాత్రం అలానే భయపెడుతున్నాయి. మునుముందు కొన్ని పెద్ద విడుదలలు రావడం చూడముచ్చటగా ఉన్నా కలెక్షన్ల పరంగా డౌట్లు ఉన్నాయి. అయితే లవ్ స్టోరి మూవీ అన్ని లెక్కలు సరి చేస్తుందని పెద్ద విజయం సాధిస్తుందని టీమ్ ధీమాగా ఉంది. ఉప్పెన- జాతి రత్నాలు రేంజులో ఊపు తెచ్చే విజయం లవ్ స్టోరి అందుకోవాలని పరిశ్రమ వర్గాలు సహా అందరూ కోరుతున్నారు. జస్ట్ వెయిట్.. మునుముందు సన్నివేశం ఎలా ఉండనుందో..!