డ్రగ్స్ లో రకుల్ - సారా పేర్లు చెప్పిన వార్తా చానెల్ కి చిక్కులు?

Tue Sep 14 2021 07:00:02 GMT+0530 (IST)

No Bollywood Names In Narcotics List

నార్కోటిక్స్ విచారణలో ఎన్.సి.బి ప్రకటించక ముందే కొన్ని బాలీవుడ్ చానెళ్లు అత్యుత్సాహం ప్రదర్శించాయని .. కొందరు సినీతారల పేర్లను బయటకు వెల్లడించాయని తాజాగా ఎన్.సి.బి పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది.ఇంతకుముందు సాగిన డ్రగ్స్ విచారణలో సారా అలీ ఖాన్ - రకుల్ ప్రీత్ సింగ్ .. డిజైనర్ సిమోన్ ఖంబట్టా పేర్లను వెలుగులోకి తెచ్చిన ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ కి పెద్ద ఇబ్బంది తప్పేట్టు లేదని కథనాలొస్తున్నాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) విచారణలో రియా చక్రవర్తి ఈ పేర్లు రివీల్ చేసిందని ప్రచారమైంది. చానెల్ లో ఆ రచయిత వెల్లడించిన వివరాలు కానీ.. ఛానెల్ కు అలాంటి లీక్‌లను ఇచ్చామన్న వివరం కానీ నిజం కాదని ఎన్.సి.బి వర్గాలు పూర్తిగా ఖండించాయి.

మరో న్యూస్ ఛానెల్ ఆ తర్వాత మరింత ఆవిష్కృతంగా ప్రచారం సాగించింది. రియా డ్రగ్ ఒప్పుకోలులో క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రా .. మీడియా మేనేజర్ రోహిణి అయ్యర్ పేర్లను ప్రస్తావించింది..  అయితే ఇవన్నీ అబద్ధాలు అంటూ ప్రఖ్యాత బాలీవుడ్ మీడియా మరో కథనాన్ని తాజాగా వెలువరించింది.  ప్రభుత్వానికి చాలా సన్నిహిత వర్గాల వివరం ప్రకారం.. “మొదటగా ఈ లీకేజీలు ఎక్కడి నుండి వస్తున్నాయి? రెండవది NCB పేర్లను బహిర్గతం చేయడానికి కుదరదు. ఈ విషయంలో నార్కోటిక్స్ వాళ్లకు ఖచ్చితంగా నిషేధం ఉంది. మూడవదిగా రియా చక్రవర్తి పేర్కొన్న పేర్లు పూర్తిగా తప్పుడువని నేను మీకు చెప్పగలను. రియా చక్రవర్తి అసలు ఏ పేర్లను ప్రస్తావించలేదు. కచ్చితంగా ఆ రెండు ఛానెల్ లు చెప్పిన పేర్లను పేర్కొనలేదు`` అని ప్రముఖ వెబ్ మీడియా కథనం ఇప్పుడు హీటెక్కిస్తోంది.

``ఇదంతా నేమ్ కాలింగ్ బిజినెస్ అని అర్నబ్ ఎఫెక్ట్`` అని .. అర్నాబ్ ఛానల్ రిపబ్లిక్ వారి TRP గేమ్ ఇది అని.. సుశాంత్-రియా వార్తలన్నిటినీ ఇతర ఛానెళ్లలో బాగా కవరేజ్ పొందుతున్నాయి కాబట్టి రిపబ్లిక్ ఏదో ఒక వార్త పట్టుకోవాలనే నిరాశలో ఫాంటసీలను వార్తలుగా మలిచారని`` ఎన్.సి.బి కి చెందిన మూలం పేర్కొంది.

సున్నిత అంశంలో బాలీవుడ్ నుండి పేర్లను వెల్లడించే ఛానెల్ లకు ఈ విధమైన బాధ్యతారాహిత్యంగా ఇలా పేర్లను ప్రచారం చేయడం.. ఏకపక్షంగా పేర్లతో కథనాలు వేయడం.. వారి కుటుంబాలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా? అంటూ ఒక అధికారి ప్రశ్నించారు.

ఇంతకు ముందు ఎన్‌సిబి డిప్యూటీ డైరెక్టర్ కెపిఎస్ మల్హోత్రా మాట్లాడుతూ ``మేము బాలీవుడ్ జాబితాను సిద్ధం చేయలేదు. ఇంతకు ముందు తయారు చేసిన జాబితా పెడ్లర్లు అక్రమ రవాణాదారులది మాత్రమే. ఇది బాలీవుడ్ వర్గాలను కలవరపడుతోంది`` అని మాత్రమే తెలిపారు. కానీ రిపబ్లిక్ చానెల్ లో ఫలానా కథానాయికలు అంటూ పేర్లు ప్రచురితమయ్యాయని సదరు అధికారి అన్నారని కథనం పేర్కొంది.

అప్పట్లో రిపబ్లిక్ చానెల్ లో కథానాయికలపై రకరకాల కథనాలు వేడెక్కించాయి. రియా చక్రవర్తి వెల్లడించిన పేర్లలో రకుల్ సహా సారా పేరుందని ఆ చానెల్ వెల్లడించింది. ఇకపోతే ఇటీవల టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారమై ఈడీ సాగిస్తున్న దర్యాప్తులో రకుల్ విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దాదాపు 9 గంటల పాటు సుదీర్ఘంగా రకుల్ ని విచారించడం హాట్ టాపిక్ అయ్యింది.