Begin typing your search above and press return to search.

సైరా తర్వాత టాలీవుడ్ పరిస్థితి డల్ గా ఉందే!

By:  Tupaki Desk   |   14 Oct 2019 4:53 AM GMT
సైరా తర్వాత టాలీవుడ్ పరిస్థితి డల్ గా ఉందే!
X
రిలీజ్ అయిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అవుతాయని అందరికీ తెలుసు. అయితే ప్రతి ఏడాదిలో టాలీవుడ్ కు కొన్ని భారీ హిట్స్ ఉంటాయి. ఈ ఏడాది మాత్రం అలాంటి హిట్ ఒక్కటంటే ఒక్కటి లేదు. సంక్రాంతి సమయంలో రిలీజ్ అయిన 'F2' ఒక్కటే హిట్టు. అయితే ఆ సినిమా అందరికీ లాభాలు తీసుకొచ్చింది కానీ కలెక్షన్స్ రేంజ్ ప్రకారం చూస్తే భారీ హిట్ అయితే కాదు. ఇక 'సాహో'.. 'సైరా' లాంటి భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. 'సాహో' కలెక్షన్స్ భారీగానే వచ్చాయి కానీ నిఖార్సైన హిట్ కాదు. ఇక 'సైరా' పరిస్థితి కూడా ఇంచుమించుగా అంతే.

ఈ ఏడాదిలో భారీ అంచనాల నడుమ ప్యాన్ ఇండియన్ రేంజ్ లో విడుదలైన సినిమాలు 'సాహో'.. 'సైరా' మాత్రమే. ఒకవేళ ఈ సినిమాలు అంచనాలు అందుకుని ఉంటే మాత్రం పరిస్థితి వేరేలా ఉండేది. ఇతర భాషలు వారు మరోసారి టాలీవుడ్ ను చూసి అసూయతో రగిలిపోయే పరిస్థితి వచ్చేది. కానీ అలా జరగలేదు. ఇక 'సైరా' తర్వాత ఆ రేంజ్ సినిమాలు ఈ ఏడాదిలో ఏవీ లేవు. అంతెందుకు.. టాప్ లీగ్ స్టార్ల సినిమాలు వచ్చేఏడాది వరకూ లేవు. దసరా తర్వాత సినిమాలకు ఇది డెడ్ సీజన్.. క్రిస్మస్ వరకూ ఈ డల్ సీజన్ కంటిన్యూ అవుతుంది.

డిసెంబర్లో కొన్ని మీడియం రేంజ్ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ఏవైనా హిట్ అయితే సరే కానీ లేకపోతే భారీ హిట్ లేకుండా ఎక్కువ ఫెయిల్యూర్లతో ముగుస్తున్న ఏడాదిగా 2019 మిగిలిపోతుంది. మరి డిసెంబర్ లో సర్ ప్రైజ్ బ్లాక్ బస్టర్లు వస్తాయేమో వేచి చూడాలి.