నెం.1 ఎన్టీఆర్.. నెం.5 మహేష్.. నెం.9 చిరంజీవి

Mon Aug 15 2022 21:00:01 GMT+0530 (IST)

No 1 NTR No 5 Mahesh No 9 Chiranjeevi

ప్రముఖ జాతీయ మీడియా ఆర్ మాక్స్ ఇండియా సినీ సెలబ్రెటీల్లో అత్యధిక ప్రజాదరణ కలిగిన వారి జాబితా ను రిలీజ్ చేస్తూ ఉంటారు. బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియన్ స్టార్స్ ల్లో కూడా టాప్ స్టార్స్ ఎవరంటూ సర్వే నిర్వహిస్తూ ఉంటారు. తాజాగా ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ నెం.1 గా నిలిచాడు.జూలై నెలలో టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరోల జాబితా విడుదల చేయడం జరిగింది. అత్యధిక ప్రజాధరణ కలిగిన హీరోగా ఎన్టీఆన్ నిలిచాడు. టాప్ 10 లో టాలీవుడ్ స్టార్ హీరోలు ప్లేస్ దక్కించుకున్నాడు. సీనియర్ హీరోల్లో కేవలం మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కింది.

నెం.1 ప్లేస్ లో ఎన్టీఆర్.. నెం. 2 ప్లేస్ లో ప్రభాస్.. నెం.3 లో అల్లు అర్జున్.. నెం.4 లో రామ్ చరణ్ మరియు నెం.5 ప్లేస్ లో మహేష్ బాబు ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో నాని.. పవన్ కళ్యాణ్.. విజయ్ దేవరకొండ.. చిరంజీవి మరియు రవితేజలు నిలిచారు.

ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ డమ్ దక్కించుకున్న ఎన్టీఆర్ నెం.1 స్థానం దక్కించుకోవడంలో ఆశ్చర్యం లేదంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక హీరోయిన్స్ లో టాప్ లో సమంత నిలిచింది. ఈ మధ్య కాలంలో తెలుగు లో ఎక్కువ సినిమాలు చేయకున్నా కూడా పాపులారిటీ విషయంలో సమంత ఏమాత్రం తగ్గలేదు.

హీరోయిన్ గా పాన్ ఇండియా స్థాయిలో స్టార్ డమ్ ను దక్కించుకున్న ఈ అమ్మడు వచ్చే ఏడాదికి పాన్ ఇండియా స్థాయిలో వరుసగా సినిమాలతో రాబోతుంది. తల్లి అయిన కాజల్ అగర్వాల్ నెం.2 గా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో పూజా హెగ్డే మరియు సాయి పల్లవి లు నిలిచారు.