Begin typing your search above and press return to search.

ఆవిరైన నివేదా ఆశ‌లు.. మ‌రి నెక్స్ట్ ఏంటి..?

By:  Tupaki Desk   |   1 Oct 2022 7:18 AM GMT
ఆవిరైన నివేదా ఆశ‌లు.. మ‌రి నెక్స్ట్ ఏంటి..?
X
ఆకట్టుకునే అందం, అలరించే నటనా ప్రతిభ ఉన్నా ఆఫ‌ర్లు లేని హీరోయిన్ల జాబితాలో నివేదా థామస్ ఒకరు. 2002లో మలయాళ చిత్రంతో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన నివేదా థామస్.. పలు సీరియల్స్ లోనూ నటించింది. 2016లో న్యాచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రగంటి మోహన‌ కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'జెంటిల్ మేన్' సినిమాతో నివేదా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.

తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ‌కు.. ఇక్కడ ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే నివేదా వ‌చ్చిన ప్ర‌తి సినిమాను ఒప్పుకోలేదు. ఆచి తూచి క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుంటూ 'జై లవకుశ', '118', 'బ్రోచేవారెవరురా' వంటి హిట్ల‌ను ఖాతాలో వేసుకుంది. అందుకు తోడు ఎలాంటి పాత్ర చేసినా అన్ని వర్గాల వారిని మెప్పించ‌గ‌లిగే స‌త్తా త‌న‌కుంద‌ని త‌క్కువ స‌మ‌యంలోనే నివేదా నిరూపించుకుంది.

గ్లామ‌ర్ షోకు దూరంగా ఉంటూ విభిన్నమైన పాత్రలు, సహజమైన నటనతో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. కానీ, ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి కెరీర్ అంత‌ స‌జావుగా సాగ‌డం లేదు. అవ‌కాశాలు బాగా త‌గ్గిపోయాయి. గ‌త ఏడాది నివేదా 'వకీల్‌ సాబ్' మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీఎంట్రీ మూవీ ఇది.

వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఇందులో ప‌ల్ల‌విగా నివేదా బాగానే ఆక‌ట్టుకుంది. అయితే ఈ సినిమాతో నివేదా కెరీర్ ఊపందుకుంటుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. ఇక రీసెంట్‌గా ఈ బ్యూటీ న‌టించిన 'శాకిని డాకిని' సినిమా విడుద‌లైంది.

కొరియన్ మూవీ 'మిడ్ నైట్ రన్నర్స్'కు రీమేక్ ఇది. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సుధీర్ వర్మ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో నివేదాతో పాటు రెజీనా ప్ర‌ధాన పాత్ర‌ను పోషించింది. అయితే సెప్టెంబ‌ర్ 16న రిలీజ్ అయిన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క బోర్లా ప‌డింది. ఈ సినిమాపై నివేదా ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది.

డైలమాలో ప‌డిన త‌న కెరీర్ కు ఈ మూవీ మంచి ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంద‌ని ఆమె భావించింది. కానీ, నివేదా ఆశ‌ల‌న్నీ ఆవిరి అయ్యాయి. ఇక ప్ర‌స్తుతం నివేదా చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేద‌ని అంటున్నారు. దీంతో నివేదా నెక్స్ట్ ఏం చేయ‌బోతుంది..? అన్నది ఆస‌క్తిక‌రంగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.