Begin typing your search above and press return to search.

పిక్ టాక్: ఎర్రచీరలో అదరహో.. అనిపిస్తున్న నివేదా అందాలు!

By:  Tupaki Desk   |   23 Jun 2021 1:18 PM GMT
పిక్ టాక్: ఎర్రచీరలో అదరహో.. అనిపిస్తున్న నివేదా అందాలు!
X
సినీ ప్రేక్షకులు ఇండస్ట్రీలో ఎంతమంది ముద్దుగుమ్మలు అడుగుపెట్టినా వారి అందాలను ఆస్వాదించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అదిగాక ఫేవరేట్ హీరోయిన్స్ ఎప్పుడెప్పుడు కొత్త అవతారంలో కనిపిస్తారా.. ఎప్పుడెప్పుడు గ్లామర్ డ్రెస్ లో ఫోటోషూట్ చేస్తారా అని వెయిట్ చేస్తుంటారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకులు బలంగా గ్లామర్ రోల్స్ లో చూడాలనుకునే హీరోయిన్స్ లిస్ట్ పెద్దదే ఉంది. కానీ అందరూ గ్లామర్ షో చేయరు కదా. అందులోను గ్లామర్ పరంగా హద్దులు కూడా పెట్టుకుంటారు. ఆ హద్దులు ఎప్పుడు చెరిపేస్తారా అని ఆశగా చూస్తుంటారు ఫ్యాన్స్.

అలా ఫలానా హీరోయిన్ గ్లామర్ షో చేస్తే బాగుంటుంది.. అనుకునే హీరోయిన్స్ లో నివేదా థామస్ ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే ఈ భామ కెరీర్ ప్రారంభం నుండి డీసెంట్ రోల్స్.. డీసెంట్ కాస్ట్యూమ్స్ ధరిస్తూ కొనసాగుతుంది. ఇటీవలే వకీల్ సాబ్ సినిమాలో మంచి రోల్ చేసి ఆకట్టుకుంది. అయితే నివేదా సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు సినిమా విశేషాలతో పాటు అందమైన ఫోటోషూట్స్ చేస్తూ ఫోటోలు పోస్ట్ చేస్తుంటుంది. అయితే తాజాగా నివేదా పోస్ట్ చేసిన ఓ పిక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అందులోను చీరకట్టులో నివేదా మాములుగా లేదనే చెప్పాలి.

ఆద్యంతం వీక్షకులకు నేత్రనందం కలిగే విధంగా ఎర్రచీరలో దర్శనమిచ్చింది అమ్మడు. చూస్తే ఆపిల్ పండులా కనిపించే నివేదా సోయగం ఎర్రచీరలో మరింత రెట్టింపు అయ్యిందనే చెప్పాలి. మాస్ రాజా సినిమాలో.. "ఎర్రకోకా పచ్చరైకా చుట్టుకొచ్చిందిరో చిన్నపాప" అన్నట్లుగా ముచ్చటగా ఉండంటున్నారు నేటిజన్లు. అయితే నిజంగానే అంతలా ఆకట్టుకుంటుందా అంటే అవును.. కొందరు హీరోయిన్స్ అందాలన్నీ ఆరబోసి క్రేజ్ దక్కించుకుంటారు. కానీ నివేదా అసలు స్కిన్ షో చేయకుండా కుర్రగుండెలు కొల్లగొడుతుంది. ప్రస్తుతం వయ్యారి ఫోటోలు సోషల్ మీడియాలో చిచ్చురేపుతున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రెసెంట్ నివేదా తెలుగులో 'శంకిని దాకిని' అనే సినిమా చేస్తోంది.