Begin typing your search above and press return to search.

బన్నీని మెరుపుతో పోల్చిన హాట్‌ బ్యూటీ

By:  Tupaki Desk   |   10 Dec 2019 1:30 AM GMT
బన్నీని మెరుపుతో పోల్చిన హాట్‌ బ్యూటీ
X
అల్లు అర్జున్‌ తో వర్క్‌ చేసిన ఎక్కువ శాతం మంది హీరోయిన్స్‌ ఆయన డాన్స్‌ పై ప్రశంసలు కురిపించడం మనం చూస్తూనే ఉన్నాం. బన్నీతో డాన్స్‌ చేయడం చాలా కష్టం అంటూ ఇప్పటికే పలువురు హీరోయిన్స్‌ అన్నారు. ఇప్పుడు తమిళ ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్‌ కూడా ఆ జాబితాలో చేరింది. ఈ అమ్మడు అల్లు అర్జున్‌ తాజా చిత్రం 'అలవైకుంఠపురంలో' సెకండ్‌ హీరోయిన్‌ గా నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా అనుభవాలను మీడియాతో ఈ అమ్మడు పంచుకుంది.

ఈ సందర్బంగా నివేదా పేతురాజ్‌ మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌ మెరుపు కంటే స్పీడ్‌ గా కదులుతాడంటూ కితాబిచ్చింది. ఆయన డాన్స్‌ స్టెప్పులను చూస్తు నోరు వెళ్లబెట్టాల్సిందే అంది. ఆయనతో స్టెప్పు కలపాలంటే చాలా కష్టమంది. రాములో రాముల పాటలో అల్లు అర్జున్‌ తో పాటు ఈ అమ్మడు కాలు కదిపిన విషయం తెల్సిందే. అందంతో పాటు అభినయం విషయంలో కూడా గత సినిమాలతో మంచి మార్కులు దక్కించుకున్న నివేదా పేతురాజ్‌ ఈ సినిమాతో టాలీవుడ్‌ లో తన స్థానంను మరింత పదిలం చేసుకోవడం కన్ఫర్మ్‌ అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన 'అల వైకుంఠపురంలో' సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా పూజా హెగ్డే నటించగా సెకండ్‌ హీరోయిన్‌ గా నివేదా పేతురాజ్‌ నటించింది. ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక మరో రెండు రోజుల్లో టీజర్‌ ను విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. బన్నీ కెరీర్‌ లో మరో హిట్‌ గా ఈ చిత్రం నిలుస్తుందని మెగా అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు.