ప్రముఖ ఎడిటర్ ను డైరెక్టర్ గా పరిచయం చేస్తున్న నితిన్..?

Thu Jun 17 2021 21:00:01 GMT+0530 (IST)

Nitin introduces famous editor as director?

యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'మాస్ట్రో' అనే క్రైమ్ కామెడీతో నటిస్తున్నాడు. 'అంధాదున్' అఫిషియల్ రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే ప్రారభమైంది. దీని తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో యువ హీరో మరో కొత్త చిత్రానికి ఓకే చేశారని.. అది కూడా ఓ డెబ్యూ డైరెక్టర్ తో అని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.టాలీవుడ్ లో ఎడిటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎస్.ఆర్. శేఖర్.. ఇప్పుడు నితిన్ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారట. ఇటీవల శేఖర్ చెప్పిన కథ నచ్చడంతో నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. నితిన్ హీరోగా నటించిన 'లై' 'చల్ మోహన్ రంగ' 'హార్ట్ ఎటాక్' వంటి సినిమాలకు ఎస్ఆర్ శేఖర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న 'మాస్ట్రో' సినిమాకి కూడా ఆయనే ఎడిటర్. ఈ క్రమంలో ఇప్పుడు శేఖర్ వర్క్ మీద నమ్మకంతో సినిమా చేయడానికి నితిన్ ఓకే చెప్పారట.

ఇదే కనుక నిజమైతే నితిన్ వర్క్ చేసే ఐదవ డెబ్యూ డైరెక్టర్ ఎస్ఆర్ శేఖర్ అవుతారు. గతంలో విజయ్ కుమార్ కొండా (గుండెజారి గల్లంతయ్యిందే).. జీవీ (హీరో).. కరుణ్ కుమార్ (ద్రోణ).. ప్రేమ్ సాయి (కొరియర్ బాయ్ కళ్యాణ్) వంటి దర్శకులను నితిన్ ఇండస్ట్రీకి పరిచయం చేసారు.