పూరి నెక్స్ట్ మూవీ జోడీగా నితిన్ - కృతి శెట్టి?

Sun Apr 18 2021 21:00:01 GMT+0530 (IST)

Nitin and Kriti Shetty as Puri next movie

పూరి జగన్నాథ్ నుంచి ఒక సినిమా వస్తుందంటేనే ఇటు యూత్ లోను .. అటు మాస్ ఆడియన్స్ లోను ఎంతో ఆసక్తి ఉంటుంది. అందుకు కారణం ఆయన ఎంచుకునే కథాకథనాలు .. వాటిని సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించే విధానం. రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్'తో సంచలన విజయాన్ని అందుకున్న ఆయన ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకి అనన్య పాండే పరిచయం కానుంది. పిప్పరమెంట్ లాంటి ఈ పిల్లను తెరపై చూసే భాగ్యం కోసం కుర్రాళ్లంతా క్యూలో ఉన్నారు.ఈ సినిమా తరువాత పూరి ఏ హీరోతో చేయనున్నాడనే ఆసక్తి అభిమానుల్లో ఉండటం సహజం. ఆ దిశగా ఒక లుక్ వేస్తే ఎక్కువగా నితిన్ పేరు వినిపిస్తోంది. గతంలో నితిన్ హీరోగా పూరి 'హార్ట్ ఎటాక్' సినిమా చేశాడు. కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు. అయినా ఇప్పుడు పూరి ఉన్న జోష్ వేరు గనుక నితిన్ అంగీకరించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమాలో నితిన్ జోడీగా ముందుగా నభా నటేశ్ ను తీసుకోవాలని అనుకున్నారట. కానీ అమ్మడు ఆల్రెడీ 'మాస్ట్రో'కి ఓకే చెప్పేసిందని కృతి శెట్టిపై దృష్టి పెట్టారట.

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో యాక్ట్ చేసే అవకాశం లభించడమే అదృష్టంగా హీరోయిన్స్ భావిస్తుంటారు. ఇక హీరోగా నితిన్ మంచి జోష్ మీద ఉన్నాడు. అందువలన కృతి శెట్టి ఓకే చెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం నాని .. సుధీర్ బాబు .. రామ్ సరసన కృతి శెట్టి నటిస్తోంది. మరోసారి వైష్ణవ్ తేజ్ జోడీగా కనిపించనుందనే టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది. నితిన్ హీరోగా పూరి నెక్స్ట్ ప్రాజక్టు అనే టాక్ నిజమే అయితే కృతి శెట్టి సోయగాలను కొత్తకోణంలో చూడచ్చని కుర్రాళ్లు కుతూహలపడటం మాత్రం ఖాయం.