Begin typing your search above and press return to search.

60 యేళ్ల వృద్ధుడిగా నితిన్‌.. గెట‌ప్ అద్దిరిపోయింద‌టగా!

By:  Tupaki Desk   |   24 Jan 2021 3:30 PM GMT
60 యేళ్ల వృద్ధుడిగా నితిన్‌.. గెట‌ప్ అద్దిరిపోయింద‌టగా!
X
హీరో నితిన్ కిట్ ను ప‌రిశీలిస్తే.. దాదాపుగా అన్నీ రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే క‌నిపిస్తాయి. అయితే.. తొలిసారిగా త‌న‌లోని న‌టున్ని మ‌రో యాంగిల్ లో ఆవిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. అలా ఇలా కాదు.. ఏకంగా 60 సంవ‌త్స‌రాల వృద్ధుడి పాత్ర‌లో క‌నిపించేందుకు సిద్ధ‌మైన యంగ్ హీరో.. అనౌన్స్ తోనే క్యూరియాసిటీ పెంచేశాడు.

నితిన్ ప్రస్తుతం తన అప్ క‌మింగ్ మూవీస్ ‘రంగ్ దే’, ‘చెక్’ పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్ లో బిజీగా ఉన్నాడు. త్వ‌ర‌లో ఈ రెండు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ థియేటర్లలో సంద‌డి చేయ‌నున్నాయి. ఈ రెండు రిలీజ్ కు రెడీ అవుతుండ‌గానే.. బాలీవుడ్ హిట్ మూవీ ‘అంధధున్’ను రీమేక్ చేయ‌బోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభ‌మైంది. దీని త‌ర్వాత చిత్రాన్ని కూడా మొద‌లు పెట్టేందుకు చూస్తున్నాడు నితిన్‌!

ఏలూరు రాజ‌కీయ‌ నేప‌థ్యంలో సాగ‌నున్న పొలిటిక‌ల్ డ్రామాలో నితిన్ న‌టించ‌బోతున్నాడు. ‘పవర్ పేట’ టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రంలో నితిన్ వైవిద్య పాత్రలో నటించబోతున్నాడు. 60 ఏళ్ల రాజకీయ నాయకుడిగా తెరపై కనిపించబోతున్నాడు నితిన్. అందుతున్న అప్డేట్ ప్రకారం.. ఈ వృద్ధ రాజ‌కీయ నాయ‌కుడి గెట‌ప్ తో ఇటీవల ఫోటోషూట్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఈ ఓల్డ్ మాన్ గెటప్ లో నితిన్ అద్భుతంగా స‌రిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఈ గెట‌ప్ సూట్ కావ‌డంతో యూనిట్ హ్యాపీగా ఉంద‌ట‌. తొలి షెడ్యూల్‌లో ఈ ఓల్డ్ మెన్‌ గెటప్‌కు సంబంధించిన స‌న్నివేశాల‌ను షూట్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ‘చల్ మోహన్ రంగ’ దర్శకుడు కృష్ణ చైతన్య డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.