Begin typing your search above and press return to search.

నిత్యామీనన్ ఫస్ట్ లిప్ లాక్ వీడియో వైరల్...!

By:  Tupaki Desk   |   15 July 2020 5:00 PM GMT
నిత్యామీనన్ ఫస్ట్ లిప్ లాక్ వీడియో వైరల్...!
X
సినీ ఇండస్ట్రీలో అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే గ్లామర్ షో కూడా అవసరమేనని అందరూ భావిస్తుంటారు. అందుకే హీరోయిన్స్ అందాల ఆరబోతకు చేయడానికి వెనుకాడరు. అయితే కొంతమంది మాత్రం గ్లామర్ షో చేసినా తమ పరిధిలోనే హద్దులు దాటకుండా సినీ ఇండస్ట్రీలో నెట్టుకొస్తున్నారు. అలాంటి హీరోయిన్స్ లలో నిత్యామీనన్ ఒకరని చెప్పవచ్చు. ''అలా మొదలైంది'' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిత్యామీనన్ పద్ధతిగా మెలిగే పాత్రలనే చేసుకుంటూ వచ్చింది. ఈ బబ్లీ బ్యూటీతో పాటు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ అందరూ కండిషన్స్ ఏమి పెట్టుకోకుండా క్రేజ్ పెంచుకుంటూ వచ్చారు. కానీ నిత్యా మాత్రం వాటికి దూరంగానే ఉంటూ వ‌చ్చింది. ఇకపోతే నిత్యామీనన్ ఈ మధ్య తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. గతేడాది 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాలో గెస్ట్ రోల్ చేసిన నిత్య ఆ తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు. ఈ క్రమంలో హిందీలో ''బ్రీత్ : ఇన్ టూ ది షాడోస్'' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ లో సడన్ గా లిప్ లాక్ సీన్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అందులోనూ ఆ లిప్ లాక్ హీరోతో కాకుండా సహ నటికి పెట్టడం గమనార్హం.

కాగా ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో 'బ్రీత్ : ఇన్ టూ ది షాడోస్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అయింది. అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో నిత్యామీనన్ జోడీగా నటించింది. అయితే స్టోరీలో భాగంగా నిత్యామీనన్ తోటి నటి శృతి బాప్నాతో లిప్ లాక్ సీన్ లో నటించింది. కథలో భాగంగా ఓ లెస్బియన్ ని ప్లాన్ చేసి ట్రాప్ చేసిన నిత్యామీనన్ ఆమెతో ఘాడమైన అధర చుంబనం చేసి.. ఆపై ఆమెను హతమార్చుతుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అనే దాన్ని పక్కన పెడితే నిత్యామీనన్ లిప్ లాక్ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిత్యా కిస్సింగ్ సీన్ సీన్ చేయడమే షాక్ అనుకుంటే అది కూడా ఓ లేడీకి లిప్ లాక్ ఇవ్వడమనేది పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ఓటీటీ కంటెంట్ కి సెన్సార్ కూడా లేకపోవడంతో ఈ సీన్ కి ఇబ్బంది ఏమీ లేకుండాపోయింది. గతంలో నాని నిర్మించిన 'అ !' సినిమాలో అమ్మాయిని లవ్ చేసే పాత్రలో నిత్యామీనన్ నటించిన ఇలాంటి కిస్సింగ్ సీన్స్ మాత్రం లేవు. మరి నిత్య వెబ్ సిరీస్ ఇలాంటి సీన్స్ లో కూడా నటించడానికి సిద్ధపడిందంటే రాబోయే రోజుల్లో సినిమాల్లో కూడా గ్లామర్ షో చేయడానికి రెడీ అవుతుందేమో చూడాలి.