పెళ్లిరోజు సందర్భంగా భార్యతో కలిసి లవ్లీ పిక్ షేర్ చేసిన నితిన్..!

Mon Jul 26 2021 18:00:01 GMT+0530 (IST)

Nitin shares lovely pic with wife on wedding day

టాలీవుడ్ యువ హీరో నితిన్ గతేడాది లాక్ డౌన్ సమయంలో తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. తాను ప్రేమించిన షాలిని కందుకూరి ని 2020 జూలై 26న వివాహం చేసుకున్నారు నితిన్. నేటికి నితిన్ - షాలిని జంట వివాహ జీవితంలో ఒక ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా నితిన్ తన భార్యతో కలిసి మొదటి యానివర్సరీ జరుపుకుంటున్నట్లు వెల్లడించారు.''నేను నా జీవితాన్ని చివరి దాకా కలిసి గడపాలనుకుంటున్న వ్యక్తికి హ్యాపీ యానివర్సరీ. నా జీవితాన్ని సులభతరం చేసినందుకు.. బెటర్ గా సంతోషంగా చేసినందుకు ధన్యవాదాలు'' అని నితిన్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా నితిన్ తన భార్యతో ఉన్న ఓ లవ్లీ పిక్చర్ ని షేర్ చేసాడు. ఇందులో షాలిని ని నితిన్ ప్రేమగా ముద్దు పెట్టుకుంతుండగా.. షాలిని తన భర్త కౌగిలిలో ఒదిగిపోయి నవ్వుతూ కనిపిస్తోంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూత్ స్టార్ అభిమానులు వారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక నితిన్ సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'మాస్ట్రో' అనే బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. ఇది నితిన్ కెరీర్ లో 30వ చిత్రం. 'అంధాదున్' అఫిషియల్ రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా విడుదలకు సిద్ధం అయింది. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి - నికిత రెడ్డి 'మాస్ట్రో' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. అలానే ఎడిటర్ ఎస్.ఆర్. శేఖర్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడని టాక్ ఉంది.