పర్ఫెక్షన్ కోసం రిస్క్ చేసిన నితిన్!

Mon Jun 27 2022 11:00:00 GMT+0530 (IST)

Nithin macherla niyojakavargam movie news

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు సరైన హిట్ పడి రెండున్నర ఏళ్లు అవుతోంది. ఈయన నుంచి చివరిగా వచ్చిన `చెక్` `రంగ్ దే` `మ్యాస్ట్రో` చిత్రాలు ప్రేక్షకులను అలరించడంలో పూర్తిగా విఫలం అయ్యాయి. ప్రస్తుతం నితిన్ హోప్స్ అన్నీ తన తదుపరి చిత్రమైన `మాచర్ల నియోజకవర్గం`పైనే పెట్టుకున్నాడు. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా చేశారు.నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ మూవీస్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం.. రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడెక్షన్ పనులను షురూ చేశారు మేకర్స్. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

అదేంటంటే.. ఈ చిత్రానికి మొదట అనుకున్న బడ్జెట్ కంటే 30 శాతం ఎక్కువ ఖర్చు అయిందట. అందుకు కారణం రీ షూట్స్ జరగడమే అని అంటున్నారు. సాధారణంగా సొంత బ్యానర్ అనగానే హీరోలు చాలా పొదుపుగా వ్యవహరిస్తుంటారు. వీలైనంత తక్కువ బడ్జెట్ లోనే సినిమాను తీయాలని ప్రయత్నిస్తుంటారు.

కానీ నితిన్ మాత్రం బడ్జెట్ విషయంలో అస్సలు రాజీ పడలేదట. `మాచర్ల నియోజకవర్గం` ఫైనల్ అవుట్ ఫుట్ చూసుకున్న నితిన్.. బెటర్ మెంట్ కోసం కొన్ని కొన్ని సీన్స్ ను రీ షూట్ చేయించాడట. దాంతో అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయిందట.

ఎలాగైనా హిట్ కొట్టాలన్న ఉద్ధేశంతోనే నితిన్ పర్ఫెక్షన్ కోసం బడ్జెట్ విషయంలో ఆ రిస్క్ చేశాడని అంటున్నారు. ఏదేమైనా సినిమా రిజల్ట్ లో పొరపాటున ఏదైనా తేడా వస్తే నితిన్ నిండా మునిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

కాగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మాచర్ల నియోజకవర్గంలోని గుంటూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డి పాత్రలో నితిన్ అలరించబోతున్నాడు. సుధాకర్ రెడ్డి నికిత రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.