Begin typing your search above and press return to search.

నితిన్ ఫ్యాన్స్ కి ఇక షాక్ లే షాక్ లు

By:  Tupaki Desk   |   23 Jan 2020 7:43 AM GMT
నితిన్ ఫ్యాన్స్ కి ఇక షాక్ లే షాక్ లు
X
యూత్ స్టార్ నితిన్ ఫ్యాన్స్ కి వ‌రుస షాక్ లు ఇవ్వ‌బోతున్నాడా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. ఓవైపు వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్న నితిన్ ఇక బ్ర‌హ్మ‌చ‌ర్యానికి ప‌ర్మినెంట్ గా ఫుల్ స్టాప్ పెట్టేయ‌బోతున్నాడు. త్వ‌ర‌లో ఓ ఇంటివాడయ్యేందుకు అత‌డు సిద్దంగా ఉన్నాడు. షాలిని అనే ఎంబీఏ గ్రాడ్యుయేట్ తో కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న నితిన్ త‌న‌ను పెళ్లికి ఒప్పించాడు. పెద్ద‌లు కుదిర్చిన ప్రేమ‌ పెళ్లి కి రంగం సిద్ధ‌మైంది. ఇరు వైపులా పెద్ద‌లు డెస్టినేష‌నేష‌న్ వెడ్డింగ్ ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది. కొద్దిమంది స‌న్నిహితులు బంధు మిత్రుల‌ స‌మ‌క్షం లో దుబాయ్ లో ఈ పెళ్లి జ‌ర‌గ‌నుంది. ఏప్రిల్ లో పెళ్లిభాజాకు ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌. అయితే పెళ్లి తేదీ ఇంకా నిశ్చ‌యించ‌లేదు. అలాగే నిశ్చితార్ధం కూడా ఇంకా జ‌ర‌గ‌లేదు. అతి త్వ‌ర‌లోనే నిశ్చ‌య‌తాంబూలానికి ఏర్పాట్లు సాగుతున్నాయ‌ట‌.

డెస్టినేష‌న్ వెడ్డింగ్ అనంత‌ర ప్ర‌ణాళిక‌లు ఇప్ప‌టికే సిద్ధం చేస్తున్నార‌ని తెలుస్తోంది. పెళ్లి అనంత‌రం హైద‌రాబాద్ లో గ్రాండ్ గా రిసెప్ష‌న్ ఉంటుంది. ఈ రిసెప్ష‌న్ కు టాలీవుడ్ సెల‌బ్రిటీలంద‌రినీ ఆహ్వానించనున్నారు. అలాగే నితిన్ ప‌రిశ్ర‌మ‌ లో త‌న‌కు బాగా క్లోజ్ గా ఉండే స్నేహితులకు గ్రాండ్ గా ఓ పార్టీ ఇవ్వ‌నున్నాడుట‌. ప్ర‌స్తుతం నితిన్ పెళ్లి కి సంబంధించిన ప‌నుల‌న్నింటిని నితిన్ అక్క.. యువ‌నిర్మాత‌ నిఖితా రెడ్డి ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నార‌ని తెలుస్తోంది.

కెరీర్ సంగ‌తి చూస్తే... నితిన్ ప్ర‌స్తుతం ఛ‌లో ఫేం వెంకీ కుడుముల‌ ద‌ర్శ‌క‌త్వంలో `భీష్మ‌` చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ లో ఉంది. అన్ని ప‌నులు పూర్తిచేసి ఫిబ్ర‌వ‌రి 21న రిలీజ్ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ప్రాజెక్ట్ ఆల‌స్యం అయిన నేప‌థ్యంలో ఎట్టి ప‌రిస్థితుల్లో ఇప్ప‌టికే ఫిక్స‌యిన‌ తేదీకి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని శ్ర‌మిస్తున్నారు. ఇక‌పై ప్ర‌చారాన్ని వేగ‌వంతం చేయనున్నార‌ని తెలుస్తోంది. ఇందులో నితిన్ కు జోడీగా ర‌ష్మిక మంద‌న న‌టిస్తోంది. త‌దుప‌రి రెండుమూడు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది.