ఆయుష్మాన్ ఖురానా ప్రభావం పడకుండా నితిన్ సెల్ఫ్ టెస్ట్!

Thu Sep 16 2021 13:03:53 GMT+0530 (IST)

Nithin Self Test Without Ayushmann Khurrana Impact

యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో `మాస్ట్రో` తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 17న ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఇది బాలీవుడ్ సినిమా `అంధాధున్` కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ప్రచారంలో భాగంగా గాంధీ కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేసారు. జీవితంలో మళ్లీ రీమేక్ సినిమాలు చేయనని వ్యాఖ్యానించారు. మరి ఇలా ఆయన ఎందుకు అన్నారో? తెలియదు గానీ..తాజాగా మాస్ట్రోని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.`తెలుగు సినిమా.. హిందీ సినిమా రెండింటీని పోల్చకండి. పేరుకే రీమేక్ కథలో చాలా మార్పులు చేసాం. ఒరిజినల్ వెర్షన్ ప్రభావం నాపై పడకుండా జాగ్రత్తపడ్డాను. అప్పుడే కథలో ప్రెష్ నెస్ వస్తుంది. కథ సోల్ కూడా మారుతుంది. సినిమా అందరీకీ ఫ్రెష్ ఫీల్ ని తీసుకొస్తుంది. `మాస్ట్రో`నచ్చితే లైక్ కొట్టు.. నచ్చకపోతే డిస్ లైక్ కొట్టు. సినిమా చూసిన తర్వాత మాత్రమే లైక్ కొట్టాలా? డిస్ లైక్ కొట్టాలా? అన్నది మీరే డిసైడ్ అవ్వండి. అలాగే విమర్శించండి. అందులో తప్పేంలేదు. లోపాలేమైనా ఉంటే తదుపరి జాగ్రత్తపడటానికి విమర్శలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. ఎలాంటి విషయాన్ని అయినా పాజిటివ్ గా తీసుకుంటాను అని అన్నారు.

`వెంకటాద్రి ఎక్స్ ప్రెస్` చిత్రంతో మేర్లపాక గాంధీ దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. తొలి సినిమానే అతనికి రచయితగా.. దర్శకుడిగా మంచి పేరు తీసుకొచ్చింది. అటుపై `ఎక్స్ ప్రెస్` రాజా చిత్రాన్ని తెరకెక్కించి మరో సక్సెస్ ని ఖాతాలో వేసుకున్నారు. అనంతరం హ్యాట్రిక్ పై కన్నేసి నేచురల్ స్టార్ నానితో `కృష్ణార్జున యుద్ధం` చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ఆ సినిమా తీవ్ర నిరాశని మిగిల్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా ఊహించని ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూవీ కాన్సెప్ట్ నిర్మిస్తోన్న `ఏక్ మినీ కథ` చిత్రానికి రచయితగా పనిచేస్తున్నారు.

బాలీవుడ్ లో విజయం సాధించిన `అంధాధున్` చిత్రానికి రీమేక్ ఇది. ఆయుష్మాన్ ఖురానా పాత్రలో నితిన్ ప్రయోగాత్మకంగా కనిపించనున్నాడు. దీంతో మాస్ట్రో పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇంతకుముందు ఆడపిల్ల సాంగ్ రిలీజ్ కాగా.. ఆకట్టుకుంది. ఇందులో నభా నటేష్ హాట్ అవతార్ లో కనిపించనుంది. ఇక తమన్నా హాటెస్ట్ స్టిల్స్ వైరల్ అయిన సంగతి తెలిసినదే. టీజర్ ట్రైలర్ లోనూ భామల అందాలు కనువిందు చేశాయి.

అసలే జూనియర్ ఇలియానాగా కిల్లర్ హాట్ బ్యూటీ ఇమేజ్ ని దక్కించుకున్న నభా.. ఎక్స్ పోజింగ్ లో ఎక్కడా తగ్గకుండా ఎలివేషన్స్ పైన దృష్టి పెడుతోంది. తనతో పోటీపడుతూ మిల్కీ బ్యూటీ ఛమక్కులు వేడెక్కించనున్నాయి. ప్రస్తుతం మాస్ట్రో టీమ్ ప్రచారం పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి-నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ తనయుడు మహతి సాగర్ సంగీతం అందించారు.