యంగ్ హీరో పై నితిన్ పంచ్ ?

Tue Feb 25 2020 16:45:11 GMT+0530 (IST)

Nithin Punch on Young Hero?

నాగ శౌర్య -వెంకీ కుడుముల మధ్య చిన్న సైజ్ గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఛలో కథ వెంకీ ఒక్కడిదే కాదని స్క్రిప్ట్ లో తన ఇన్వాల్వ్ మెంట్ కూడా ఉందని చెప్పుకున్నాడు శౌర్య. అంతే కాదు తనతో సినిమా చేద్దామని డిసైడ్ అయ్యాక ఓ దరిద్రమైన స్క్రిప్ట్ తో వచ్చాడని. ఆ సమయంలో తను గైడెన్స్ ఇచ్చి ఛలో స్క్రిప్ట్ రాయించానని అన్నాడు. ఆ సినిమా రిలీజ్ తర్వాత తనతో టచ్ లో లేకుండా తిరుగుతున్నాడని తమిచ్చిన కార్ కూడా అమ్మేసాడని మీడియా ఇంటర్వ్యూ లో తెలిపాడు శౌర్య.వెంకీ కుడుముల పై శౌర్య చేసిన కామెంట్స్ మొన్నటి వరకూ హాట్ టాపిక్ అయింది. అయితే ఈ విషయంపై వెంకీ సైలెన్స్ మైంటైన్ చేసాడు. ఎక్కడా ఓపెన్ అవ్వకుండా టాపిక్ ఇగ్నోర్ చేసాడు. ఇక భీష్మ సక్సెస్ మీట్ లో మరో సారి శౌర్య చేసిన కామెంట్స్ టాపిక్ హైలైట్ అయింది. ఈ సారి నితిన్ శౌర్య పై పంచ్ వేసాడు.

వెంకీ కుడుముల స్పీచ్ ఇస్తుండగా చివర్లో మైక్ లాక్కొని ఈ స్క్రిప్ట్ నీదేనా ? అంటూ కామెంట్ చేసాడు. దీంతో ఈవెంట్ లో నితిన్ పంచ్ టాపిక్ అయింది. నితిన్ శౌర్య మీద ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేశాడంటూ చర్చ నడిచింది. ఏదేమైనా మీడియా ముందు ఇది బడితే అది మాట్లాడి ఇండస్ట్రీ కొందరికి దూరం అవుతున్నాడు శౌర్య.