Begin typing your search above and press return to search.

కుర్ర హీరో పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడుగా

By:  Tupaki Desk   |   14 Nov 2019 1:30 AM GMT
కుర్ర హీరో పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడుగా
X
శ్రీనివాస కళ్యాణం తర్వాత కొన్ని నెలల పాటు గ్యాప్ తీసుకొని ఇంట్లోనే ఉండిపోయిన నితిన్ ఆ గ్యాప్ లో వరుస ప్రాజెక్ట్స్ సెట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. వెంకీ కుడుములతో భీష్మ , చంద్ర శేఖర్ ఏలేటి తో మరో సినిమా , వెంకీ అట్లూరితో 'రంగ్ దే' ఇలా మూడు సినిమాలు లైన్లో పెట్టి సెట్స్ పైకి తెచ్చేసాడు. ప్రస్తుతం భీష్మ షూటింగ్ ని ఫినిషింగ్ స్టేజికి తెచ్చిన నితిన్ మరో వైపు చంద్ర శేఖర్ ఏలేటి సినిమాతో పాటు 'రంగ్ దే' ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న నితిన్ నెక్స్ట్ ఓ రీమేక్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.

ఇటివలే నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి 'అంధధున్' అనే హిందే సినిమాకు సంబంధించి తెలుగు రీమేక్ రైట్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే రెండు సినిమాలో పూర్తి చేసిన వెంటనే ఈ రీమేక్ ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పటికే అనౌన్స్ చేసిన కృష్ణ చైతన్య తో సినిమా చేసే ప్లాన్ లో నితిన్ ఉన్నట్లు తెలుస్తుంది.

ఇలా వరుసగా ఏకంగా ఐదు సినిమాలతో నెలల గ్యాప్ లోనే ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నాడు నితిన్. మరి ఈ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాలు సాదిస్తాడో చూడాలి. సినిమాను సుదీర్ వర్మ చేతిలో పెతబోతున్నారట