పక్కా స్కెచ్ తో నితిన్ ప్లానింగ్

Sun Jan 20 2019 18:37:39 GMT+0530 (IST)

Nithiin Pre Planned For His Next Movie

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిన అఆ గ్రాండ్ సక్సెస్ కాస్త ట్రాక్ తప్పిన నితిన్ కెరీర్ ని తిరిగి సెట్ చేసినా ఆ తర్వాత వచ్చిన హ్యాట్రిక్ మూవీస్ వరసగా నిరాశపరచడంతో కాస్త డిఫెన్స్ లో పడినట్టు అనిపించింది. యాక్షన్ థ్రిల్లర్ చేద్దామని లై చేస్తే అది పోటీలో నలిగిపోయి టాక్ తో పాటు వసూళ్ళనూ తేడాగా తెచ్చింది. పోనీ క్యూట్ లవ్ స్టొరీతో ఆకట్టుకుందామని చల్ మోహనరంగాను వదిలితే తక్కువ గ్యాప్ లో రంగస్థలంతో పోటీ పడి నిలవలేకపోయింది. సరే ఈ రెండు జానర్స్ వద్దనుకుని ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసి ముచ్చటపడి దిల్ రాజు బ్యానర్ లో శ్రీనివాస కళ్యాణంతో ముందుకు వస్తే వెనుక రెండే చాలా బెటర్ అనిపించే ఫలితం దక్కింది.దీంతో కాస్త విశ్లేషణ చేసుకున్న నితిన్ కొంత గ్యాప్ వచ్చినా సరే సరైన కథలను దర్శకులను ఎంచుకునే పనిలో పడ్డాడు. మొదటి సినిమాతోనే గత ఏడాది టాప్ హిట్స్ ఒకటి సాధించిన వెంకీ కుడుములను బ్లాక్ చేసుకున్న నితిన్ త్వరలోనే దాని షూటింగ్ మొదలుపెట్టబోతున్నాడు. భీష్మ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. రష్మిక మందన్న హీరొయిన్ గా ఫిక్స్ చేసారు. ఎంటర్ టైన్మెంట్ ఉంటూనే మంచి లవ్ స్టొరీ ని సెట్ చేసుకున్నట్టు తెలిసింది.

దీంతో పాటు కుమారి 21 ఎఫ్ ఫేం సూర్య ప్రతాప్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నితిన్. ఇది వేసవిలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవి కాకుండా తన ప్రొడక్షన్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో తమిళ్ హిట్ మూవీ రట్ససన్ రీమేక్ చేసే ప్లానింగ్ లో ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. ఇది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మొత్తానికి ఓ నాలుగు నెలలు గ్యాప్ తీసుకున్నా నితిన్ పక్కా స్కెచ్ తో తెలివిగా ప్లాన్ చేసుకుంటున్నాడు