ఫస్ట్ లుక్ : స్వీటీ నిశ్శబ్ద చిత్రం

Wed Sep 11 2019 11:55:16 GMT+0530 (IST)

Nishabdham First Look

స్వీటీ అనుష్క సుమారు రెండేళ్ల గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమాలు రెండు. ఒకటి సైరా కాగా రెండోది నిశ్శబ్దం. సైరాలో చిన్న క్యామియో కాబట్టి పూర్తి పరిగణనలోకి తీసుకోలేం కానీ నిశ్శబ్దం మాత్రం ఫుల్ లెన్త్ రోల్ కనక అభిమానులు దీని మీద అంచనాలు పెట్టుకున్నారు. ఇందాకే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అనుష్క ఇందులో సాక్షి అనే మ్యూట్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది. అంటే తనకు మాటలు రావన్న మాట. అయినా కూడా అద్భుతంగా పెయింటింగ్స్ వేయడంలో తను నేర్పరి.ఇక్కడ పోస్టర్ లో రివీల్ చేసింది కూడా అదే. కాకపోతే తను ఏ బొమ్మ వేసింది చూపలేదు కానీ అనుష్క లుక్ మాత్రం చాలా ప్లెజెంట్ గా ఉంది. భాగమతిలో కనిపించిన బొద్దుతనం చాలా మటుకు మాయమైపోయి క్యూట్ లుక్స్ లోకి వచ్చేసింది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న నిశ్శబ్దంకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. మాధవన్ మరో కీలక పాత్రలో కనిపించే ఈ మూవీ థ్రిల్లర్ జోనర్ లో రూపొందుతోంది.

కోన వెంకట్ తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ భాగస్వామిగా వ్యవహిస్తున్నారు. అధిక శాతం విదేశాల్లోనే షూటింగ్ జరుపుకున్న నిశ్శబ్దంలో పెయింటర్ గా ఉన్న అనుష్క ఎదుర్కున్న సమస్య ఏమిటి అందులో ఎలా బయటపడింది లాంటి క్లూస్ తెలియాలంటే టీజర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఈ ఏడాదే విడుదల కానున్న నిశ్శబ్దం ఇంగ్లీష్ తో కలిపి మొత్తం నాలుగు భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు