Begin typing your search above and press return to search.

నిత్యామీన‌న్‌ - రీతూవ‌ర్మ - అశోక్ సెల్వ‌న్‌ ల 'నిన్నిలా నిన్నిలా' ఫస్ట్ లుక్...!

By:  Tupaki Desk   |   19 Oct 2020 7:50 AM GMT
నిత్యామీన‌న్‌ - రీతూవ‌ర్మ - అశోక్ సెల్వ‌న్‌ ల నిన్నిలా నిన్నిలా ఫస్ట్ లుక్...!
X
అశోక్ సెల్వ‌న్‌ - నిత్యామీన‌న్‌ - రీతూవ‌ర్మ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ ''నిన్నిలా నిన్నిలా''. బాపినీడు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌ పై బీవీఎస్ఎన్‌ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ద్వారా అని.ఐ.వి.శ‌శి అనే యువ దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ మరియు ఫ‌స్ట్‌ లుక్‌ ను పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుద‌ల చేశారు.

కాగా, 'నిన్నిలా నిన్నిలా' చిత్రం గురించి నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ''ఒక మోస్తరు బడ్జెట్ చిత్రాన్ని నిర్మించి కొంతకాలం అయ్యింది. అవుట్‌ పుట్‌ తో మా టీమ్ మొత్తం చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ చిత్రం ఒక అర్బన్ రొమాంటిక్ కామెడీ డ్రామా. ఇది ఖచ్చితంగా మన తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకం ఉంది'' అని చెప్పారు. అలానే త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ డేట్‌ ను అనౌన్స్ చేస్తామ‌ని మేకర్స్ తెలిపారు. ఇక ఈ చిత్రానికి 'ప్రేమమ్' ఫేమ్ రాజేష్ మురుగేసన్ సంగీతం సమకూరుస్తున్నారు. దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.